Redmi Note 11s: చార్జర్ లేకుండా ఫోన్ విడుదల
Redmi Note 11s: ఏ ఫోన్ కొనుక్కున్న ఫోన్ తో పాటు చార్జర్, ఇయర్ ఫోన్స్ వస్తాయి. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని స్మార్ట్ ఫోన్లకు ఇయర్ ఫోన్స్ లేకుండా చార్జర్ మాత్రమే ఇస్తున్నారు. అయితే ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ కంపెనీ షియోమి చార్జర్ లేకుండా స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. తాజాగా రెడ్మి నోట్ 11S ఈ స్మార్ట్ ఫోన్ ను షియోమీ లాంచ్ చేసింది.
ఇందులో చార్జర్ లేకపోవడం విశేషమని చెప్పవచ్చు ఈ మేరకు షియోమీ ఇండియా అధికారిక వెబ్సైట్లో ఈ విషయాన్ని తెలియజేశారు. నోటీస్ ఇస్ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫోన్ తో పాటు యు ఎస్ బి కేబుల్, ప్రొటెక్టివ్ కేస్, క్విక్ స్టార్ట్ గైడ్, డిజెక్టర్ టూల్, వారంటీ కార్డులు ఉన్నాయి.
అయితే చార్జర్ లేకుండా ఫోను విడుదల చేయటం షియోమీ సంస్థ ఒక్కటే కాదు. గతంలో గూగుల్ , Samsung, యాపిల్ కంపెనీలు కూడా చార్జర్ లేకుండా ఫోను విడుదల చేశాయి. తాజాగా ఇప్పుడు రెడ్మి కూడా ఆ కంపెనీల బాటలో నడిచింది.
ఈ ఫోనును షియోమీ ఆగస్టు 31 నుంచి ఆన్లైన్లో అందుబాటులో కి వస్తుంది. ఇది 6GB RAM + 64GB ROM వేరియంట్ ధర ₹13,499 ఉంటుంది. చార్జర్ లేకపోవడంతో ఈ ఫోన్ ను ఎవరు కొనుగోలు చేయరు అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారతదేశంలో చాలా మంది దగ్గర రెడ్ మీ చార్జర్లు ఉండవచ్చని షియోమీ భావిస్తుందని తెలిపారు. అందువలన చార్జర్ లేకుండా ఫోన్ ను విడుదల చేసింది. రెడ్మీ నోట్ ఎస్ సిరీస్ బ్రాండ్ వెర్షన్ గా ఈ ఫోను భారతదేశంలో విడుదల చేశారు.
అందుబాటు ధరలో లభించే 5G స్మార్ట్ ఫోన్లు ఇవే