Viral News: తల్లి కొడుకు ఒకటే స్కూల్
చదువుకోవాలని కోరిక పట్టుదల ఉంటే చాలు వయసుతో సంబంధం లేదు అని మరోసారి నిరూపించింది ఓ మహిళ. తమ ఇద్దరు పిల్లలతో పాటు కలిసి ఇప్పుడు బడికి వెళుతుంది. ఆమె కనీసం 12వ తరగతి పూర్తి చేయాలని అనుకుంటుందని చెబుతోంది నేపాల్ కి చెందిన ఇద్దరు పిల్లలు తల్లి పార్వతి సునర్.
15 సంవత్సరాల వయసులో తన కంటే ఏడు సంవత్సరాలు పెద్దవాడైన యువకుడిని ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకుంది. దీంతో చదువుకు ఫుల్ స్టాప్ పడింది, అయితే ఇప్పుడు మళ్లీ బడిబాట పట్టింది. ఆమె కొడుకు చదువుతున్న పాఠశాలలోనే ఆమె కూడా చదువుకుంటుంది. ఏడవ తరగతి చదువుతున్న నేపాల్ దేశానికి నైరుతిలో ఉన్న పునర్భాస్ గ్రామంలో పార్వతి అనే మహిళ ఉంటుంది.
తాను నేర్చుకోవడంలో ఆనందిస్తున్నానని పిల్లల లాంటి క్లాస్మేట్లతో స్కూల్ కూడా హాజరవుతున్నందుకు గర్వపడుతున్నానని పార్వతి చెబుతోంది. 29 మిలియన్ల మంది ఉన్న నేపాల్ దేశంలో కేవలం 57 శాతం మంది మహిళలు మాత్రమే అక్షరాసులు ఉన్నారు. 27 ఏళ్లు ఉన్న పార్వతి మాట్లాడుతూ తనకు తగినంత అక్షరాస్యత కావాలని భావిస్తుందట.
అందుకని తిరిగి బడిలో చేరి చదువుకుంటున్నట్లు తెలిపింది. తమకు 16 సంవత్సరాల వయసులోని మొదటి బిడ్డకు జన్మదిన ఇవ్వడంతో చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ చదువు అనే కోరికను తీర్చుకోవటానికి మళ్లీ బడిబాటను పట్టాలు అని తెలిపింది. అమ్మతో కలిసి స్కూల్ కి వెళ్లడం తనకు చాలా ఆనందంగా ఉంది అని 11 ఏళ్ల కొడుకు రేషమ్ అంటున్నాడు అంతేకాదు చదువు విషయంలో తల్లి కంటే తన కొడుకు వెనుకబడి ఉన్నాడు అంట.
తల్లితో కలిసి చదువుకోవటం భోజనం చేయటం మరియు విరామం సమయంలో కూడా తల్లితోనే గడుపుతాడు. సమీపంలో ఉన్నావు కంప్యూటర్ క్లాసులకు ఇద్దరూ కలిసి సైకిల్ పైనే వెళ్తున్నారు. తాము పాఠశాలకు వెళ్తున్న సమయంలో చదువు గురించి మాట్లాడుకుంటామని అలాగే ఎన్నో విషయాలు గురించి నేర్చుకుంటామని రేషమ్ అన్నాడు.
అయితే తన కొడుకు డాక్టర్ కావాలి అని తల్లి పార్వతి కోరుకుంటుంది. పార్వతి బాగానే నేర్చుకుంటుందని గ్రామ పాఠశాల ప్రిన్సిపల్ జీవన్ జ్యోతి, భరత్ బస్నెట్ తెలిపారు. పార్వతి భర్త కుటుంబ పోషణ కోసం దక్షిణ భారతదేశంలో ఉన్న చెన్నై నగరంలో కూలీ పని చేస్తున్నాడు. పార్వతీ తన కుమారులు అర్జున్, రేషమ్ తన అత్త గారితో కలిసి నేపాలలో ఒక చిన్న రేకుల షెడ్డులో నివసిస్తున్నారు.
తెల్లవారుజామున నుంచి రోజు ప్రారంభిస్తుంది కనీసం ఇంటికి మరుగుదొడ్డి కూడా లేదు, పుట్టినరోజులకు కేకులను తయారు చేయడం, ఇంటి చుట్టూ ఉన్న పచ్చని పొలాల్లో పనిచేయటం వంటి పనులతో ఆదాయాన్ని సమకూర్చుకుంతారు. స్కూల్ యూనిఫామ్ ధరించి పార్వతి తన కొడుకుతో పాటు నడుచుకుంటూ బడికి వెళుతుంది.
నేపాలలో ఎప్పటికీ మహిళల వివక్షతను ఎదుర్కొంటున్నారు ఇంటి నుంచి బయటకు వచ్చి చదువుకుని విధంగా గ్రామీణ మహిళలకు పార్వతి ఆదర్శంగా నిలిచింది. బాల్య వివాహాలు చట్టవృద్ధమైనప్పటికీ అక్కడక్కడ విస్తృతంగా జరుగుతూనే ఉన్నాయి. పాఠశాలలో బాలికలకు మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు లేవు అని స్కూలు ఉపాధ్యాయులు తెలిపారు.
మరుగుదొడ్లు లేనందున చాలామంది అమ్మాయిలు వారి పీరియడ్స్ సమయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని మానేస్తున్నారు. అయితే తిరిగి చదువుకునేందుకు పోరుగులో ఉన్న ఇండియాలో ఇంటి పనిమనిషి ఉద్యోగానికి పార్వతి వదులుకుంది. తాను ఎంత కష్టమైనా పడి 12వ తరగతి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతుంది.