WhatsApp Alert: వీరి ఖాతాలను నిలిపి వేసిన వాట్సాప్
WhatsApp Alert: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న 23 లక్షలకు పైగా కుండ్లను ఆగస్టు నెలలో వాట్సాప్ నిషేధించడం జరిగింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 10 లక్షల ఖాతాలను ముందస్తుగానే నిషేధించినట్లు చెప్పుకొచ్చింది వాట్సాప్.
ఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా వివరిస్తున్న 23 లక్షల వాట్సప్ అకౌంట్లను ఆగస్టు నెలలో నిషేధించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా వీటిలో పది లక్షలకు పైగా ఖాతాలను ముందస్తుగాని నిషేధించినట్లు చెప్పుకొచ్చింది. అయితే జూలై కంటే ఆగస్టులో నిషేధించిన ఖాతాలే తక్కువ. ఈ ఏడాదిలో జూలై నెలలో 23.87 లక్షలకు పైగా ఖాతాలను వాట్సాప్ నిషేధించింది.
ఆగస్టు 1,2022 నుంచి ఆగస్టు 31, 2022 మధ్యకాలంలో భారత్ కు చెందిన 23,28,000 ఖాతాలపై నిషేధం విధించారు. వీటిలో 10,08,000 ఖాతాలను ముందస్తుగానే నిషేధించాం. ఆని వాట్సాప్ తన నెల నివేదికలో పేర్కొంది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సమస్త సాంకేతికత ఆధారంగా గుర్తించిన మేరకు జూన్ నెలలో భారత్ కు చెందిన దాదాపు 22 లక్షలకు పైగా ఖాతాలను వాట్సప్ తొలగించింది. మే నెలలో 19 లక్షలు, ఏప్రిల్ 18.05 లక్షల ఖాతాలను తొలగించినట్లు తెలిపింది.
సోషల్ మీడియాలో ఆవాస్తవాలు, అశ్లీలత విస్తరిస్తున్న నేపథ్యంలో గత ఏడాది నుంచి భారత్ లో కొత్త ఐటీ కంపెనీల నిబంధనలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం 50 లక్షల రూపాయల యూసర్లు ఉన్న డిజిటల్ flatforms అన్నీ ప్రతి నెల నివేదికను వెల్లడించాల్సి ఉంటుంది. అందులో నిబంధనలను అతిక్రమించిన ఎంతమందిని గుర్తించారో? వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు తెలపాల్సి ఉంటుంది. తాజా నివేదిక ప్రకారం ఆగస్టు నెలలో 598 ఫిర్యాదులు అందగా.. వాటిలో 19 మంది పై చర్యలు తీసుకున్నట్లు వాట్సప్ వెల్లడించింది.