Gold price: ఢిల్లీలో పెరుగుతున్న బంగారం ధరలు
Gold price: బంగారం అంటే ఇష్టం లేని వ్యక్తులంటూ ఎవ్వరు ఉండరు అలాంటి బంగారం ధరలు ఈరోజు ఆకాశాన్ని అంది విధంగా మరల పెరిగాయి. ఇన్వెస్టర్లు ధరలలో కరెక్షన్ టైంలో చిన్న మొత్తాలను కొని పెట్టుకోవాలని నిపుణులు సూచించారు. మంచి లాభం, రాబడి రావాలంటే 3-5 సంవత్సరాలు బంగారం కలిగి ఉండడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. దసరా నవరాత్రులు పూర్తయిన తర్వాత గురువారం భారత బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలలో మార్పులు కనిపించింది.
10 గ్రాముల బంగారం ధర రూ.52,220 చేరింది. అలాగే కిలో వెండి కొద్దిగా తగ్గి ప్రస్తుతం రూ.61,605 చేరింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో గురువారం రోజుకి, 10 గ్రాముల బంగారం రూ.497 కి పెరిగి రూ.52,220 కి చేరుకుంది. దీనివల్ల ఇంతకుముందు ట్రేడింగ్ సెషన్ లో 10 గ్రాముల బంగారం రూ.51,723గా వుంది. కిలో వెండి ధర రూ.80 తగ్గి తర్వాత రూ.61,605 కు చేరుకుంది.
ఇంతకుముందు కిలో వెండి క్రితం ముగింపు రూ.61,685 గా వుంది. దేశీయ మార్కెట్లో బంగారం కొద్దిపాటి స్వల్ప సానుకూల ధోరణితో అస్థిరంగా ఉండవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ హెడ్ హరీష్. వి తెలిపారు. సమీప భవిష్యత్తులో 10 గ్రాముల బంగారం ధర రూ.52800-49200 లోపు ఉండొచ్చు.
బలహీనమైన భారతీయ కరెన్సీ, యూఎస్ డాలర్లలో కరెక్షన్ కూడా ధరలకు మద్దతు ఇవ్వచ్చు. అయితే ఇన్వెస్టర్లు ధరలలో కరెక్షన్ టైం లో చిన్న మొత్తాలను కొని ఉంచుకోవాలని నిపుణులు అంటున్నారు. మంచి లాభం, రాబడి కొసం 3-5 సంవత్సరాలు బంగారం కలిగి ఉండడం మంచిదని నిపుణులు సూచించారు.