Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

David Miller’s Daughter : చనిపోయింది డేవిడ్ మిల్లర్ కూతురేనా?

David Miller’s Daughter: సౌత్ ఆఫ్రికా స్టార్ క్రికెట్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ కూతురు చనిపోయిందన్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. ఈ విషయం ఎంతవరకు నిజమనేది మనం స్పష్టంగా తెలుసుకుందాం.

ఈ క్రికెట్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో చెప్పిన ఓ విషాద న్యూస్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెస్ట్ ఇన్ పీస్ మై లిటిల్ స్టార్.. లవ్ యు ఆల్వేస్ అంటూ ఈ ఆటగాడు ఒక పాపతో కలిసి తీసుకున్న ఫోటోలు అన్ని ఒక మంచి వీడియో గా తయారుచేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.

చనిపోయింది డేవిడ్ మిల్లర్ కూతురేనా?

అయినప్పటికీ ఆ పాప ఎవరో కాదు.. క్రికెట్ ఆటగాడు అయిన డేవిడ్ మిల్లర్ కూతురే అన్ని సోషల్ మీడియాలో వైరల్ అయింది. డేవిడ్ మిల్లర్ కూతురు క్యాన్సర్ వ్యాధితో పోరాడి తను చనిపోయినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతున్నాయి. అయితే వాస్తవానికి చిన్న పాప డేవిడ్ మిల్లర్ కూతురు కాదని తన స్నేహితుడి కూతురు అని మరికొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెప్పుకొచ్చాయి.

అయితే ట్విటర్ లోను ఒక యూజర్ ఈ విషయం గురించి ఆలోచిస్తూ చనిపోయింది. డేవిడ్ మిల్లర్ కూతురు కాదని తన క్లోజ్ ఫ్రెండ్ కూతురు అని ట్విట్ చేశాడు. అయితే ఆ పాప డేవిడ్ మిల్లర్ కి చాలా పెద్ద అభిమాని కావడం.. ఆ చిన్నా రితో చాలా సాన్నిహిత్యం ఉండడంతో ఆ న్యూస్ ను తీసుకోలేకపోయిన డేవిడ్ మిల్లర్ తన మనోభావాలని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడని తెలుస్తుంది. ఇండియాతో వన్డే సిరీస్ లో భాగంగా ప్రస్తుతం మిల్లర్ ఇండియాలో ఉండవలసి వచ్చింది.

ఒకవేళ చనిపోయింది నిజంగా తన కూతురు అయితే తాను తిరిగి సౌత్ ఆఫ్రికా కు తిరుగు ప్రయాణిస్తున్న విషయాన్ని కూడా చెప్పే ఆస్కారం ఉండేది. కానీ అలాంటి వార్త ఏది రాలేదు కనుక ఆ పాప డేవిడ్ మిల్లర్ కూతురు కాకపోయే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker