BMW G 310 RR మార్కెట్ లో కి విడుదల, ధర, ఫీచర్స్
BMW నుండి కొత్త బైక్ మార్కెట్లోకి వచ్చింది. అది BMW G 310 RR. దీని యొక్క విలువ రూ. 2,85,000/-, G 310 RR ఇది జర్మనీ బ్రాండ్ నుండి అత్యంత శక్తివంతమైన స్పోర్ట్స్ బైక్ గా మారింది. BMW G 310 RR దీనిని TVS APACHE 310 ఆధారంగా తీసుకొని రూపొందించింది. అయితే దీనిలో ప్రత్యేక అంశాలు ఉన్నాయి.
దీనిలో అందంగా స్టైల్ గా కనిపించే స్పోర్ట్స్ కలర్ వేరియంట్ లో విలువ రూ. 2,99,000/-. G 310 RR అంతర్జాతీయ మార్కెట్లో KTM RC 390 కి వ్యతిరేకంగా BMW మోటోరాడ్ ఉంది. దీనికి ముందర చక్రానికి డిస్క్ బ్రేక్ కలదు. అదేవిధంగా వెనుక చక్రానికి కూడా డిస్క్ బ్రేక్ ఉంది.
దీని యొక్క టార్కు 27 Nm, 33.99 Ps శక్తి కలగజేస్తుంది. వీటికి ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి. BMW G 310 RR యొక్క మైలేజ్ 30.3 Kmpl. G 310 RR తెలుపు, నలుపు రంగులను కలిగి ఉంది.
దీని యొక్క ఇంధన సామర్థ్యం 12 లీటర్లు. ABS ద్వంద చానల్లో, DLR లు, బ్లూటూత్ తో మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసుకునే సౌకర్యం కలదు. దీని యొక్క బరువు 179 కేజీలు ఉంటుంది. దీని యొక్క టాప్ స్పీడ్ 143 నుండి 145 వరకు ఉంటుంది.