Viral Video: హోంవర్క్ గురించి ప్రధాని మోడీ కి వీడియో ద్వారా ఫిర్యాదు
ఒక చిన్నారి తనకి స్కూల్ లో తనకి వచ్చిన సమస్యలను ఏకంగా ప్రధానికి పిర్యాదు చేసింది.ముందుగా తన పేరు చెప్పి తరువాత తన పాటశాల పేరు చెప్పి ఒక వీడియో ద్వారా ప్రధానికి సమస్యలను పిర్యాదు చేసింది.
చిన్న పిల్లలు భగవంతుడి స్వరూపం అని అంటారు.పిల్లల మనసు లో కల్మషం వుండదు.ప్రస్తుతం సోషల్ మీడియా లో పిల్లలకి సంబంధించిన ఏ వీడియో వచ్చిన కూడా నెట్టింటా వైరల్ అయ్యి అందరిని ఆకట్టుకోవడం జరుగుతుంది.
కొత్తగా సోషల్ మీడియా లో ఒక చిన్నారి వీడియో వైరల్ అవుతుంది.వైరల్ అవుతున్న వీడియో లో చిన్నారి తనకు స్కూల్ లో ఇచ్చే హోంవర్క్ గురించి ఆందోళన చెందుతూ ఏకంగా తన హోంవర్క్ గురించి ప్రధాని మోడీ కి వీడియో ద్వారా ఫిర్యాదు చేసింది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవరికి తెలియదు. ఆ చిన్నారి తన సమస్యలను చెప్పిన విధానం చూస్తుంటే,తన పాటశాల లో ఇస్తున్న హోంవర్క్ తో చాలా బాధ పడినట్లు తెలుస్తోంది.తన కి ఇచ్చే హోంవర్క్ కారణంగా తనకి ఎంతో ఇష్టం అయిన ఆటలను కూడా ఆడ లేకపోతున్నట్లు బాధను వ్యక్తం చేసింది.
వైరల్ వీడియో లో చిన్నారి మొదట తన పేరు చెప్పింది,తరువాత తను ఏ స్కూల్ లో చదువుతుంది చెప్పింది.తరువాత ప్రధాని మోడీ కి తనకి వచ్చిన సమస్యలను వివరిస్తూ,కంప్లైంట్ ఎవ్వడం ప్రారంభించింది
.తనకు చాలా హోంవర్క్ ఇస్తున్నారని,ఆడుకునే సమయం కూడా లేదని చిన్నారి చెప్పింది.మేము ఎంత హోంవర్క్ చేస్తున్నామో కూడా టీచర్స్ కి తెలియదని చెప్పింది.అంతే కాకుండా ఇంట్లో అమ్మ కూడా చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పింది.అందువలన మాకు ఎక్కువగా హోంవర్క్ ఎవ్వకుడదని,మేము చిన్న పిల్లలం కనుక స్కూల్ వారు అది గుర్తుపెట్టుకొని తక్కువగా ఎవ్వలని కోరింది.