N. V. Ramana:ఎన్ వి రమణ నోట కంగారు కోర్ట్
“రవి కాంచని చోట కవి కాంచెను”
“కవి కాంచని చోట మీడియ కాంచును.”
“మీడియా కాంచని చోట సోషల్ మీడియ కాంచును.
ఇటీవల కాలంలో భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఎన్వి రమణ గారి నోట కంగారు కోర్టు అనే పదం వినబడింది.
కంగారు కోర్టు.
అసలు ఎంటి ఈ కంగారు కోర్టు?
కొంత మంది వ్యక్తుల సమూహం చేత అనధికారికంగా ఒక సంఘటన మీద న్యాయాన్ని నిర్ణయించే విధానంలో అనగా న్యాయం అనేది కంగారుల మాదిరిగా ఒకచోట నుంచి మరొక చోటికి ఎగురుతూ…. సరైన విధానంలో జరగకుండా సోషల్ మీడియా కోర్ట్ లాగా మారిపోవడం. న్యాయమూర్తులను సోషల్ మీడియా అనేది ప్రభావితం చేస్తూ న్యాయాన్ని నిర్ణయించడం.
ప్రపంచ చరిత్రలో వెళ్ళి చూస్తే ప్రపంచంలో కంగారు కోర్టు ల మాదిరిగా రష్యా లో స్టాలిన్ మాస్కో కోర్టు ను నిర్వహించేవారు. అదేవిధంగా జర్మన్ లో హిట్లర్ కూడా ఇదే విధమైన సత్వర న్యాయాన్ని అందించే విధంగా కోర్టులను నిర్వహించేవారు.
సోషల్ మీడియా అనేది ఎంతవరకు నిజాలను తెలియజేస్తుంది 360 డిగ్రీల కోణంలో పరిశీలించి ప్రసారాలు జరుగుతున్నాయా? సోషల్ మీడియాకు ఇలాంటి బాధ్యతలు ఏమైనా ఉన్నాయా?
భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి వ్యక్తికి కలిగి ఉంది. ఈ భావ ప్రకటన స్వేచ్ఛను సోషల్ మీడియా ఎంతవరకు బాధ్యతాయుతంగా తీసుకొని ప్రవర్తిస్తుంది ఏదైనా ఒక సంఘటన జరిగిన వెంటనే ఆ సంఘటన మీదుగా రకరకాలుగా చిత్రీకరించి వారే అనధికారికంగా ఒక సత్వర న్యాయాన్ని అందించే విధంగా నిర్ణయాలు తీసుకుని న్యాయమూర్తులను కూడా ప్రభావితం చేసే విధంగా మారిపోతున్నాయి.
ఇటీవల కాలంలో భారతదేశం లో కూడా గతంలో నానావతి కేసు 1960 మధ్యకాలంలో అదేవిధంగా హరుషి తల్వార్ కేసు, సుశాంత్ సింగ్ కేసు, దిశా కేసు ప్రస్తుతం నుపుర్ శర్మ వర్సెస్ ప్రోఫెట్ మహమ్మద్ కేసులలో కూడా ప్రజలు సత్వర న్యాయాన్ని అందించాలని ఆలోచనలో సోషల్ మీడియా ప్రజలను అత్యధికంగా ప్రభావితం చేసి చివరికి న్యాయమూర్తులను కూడా ప్రభావితం చేసి కేసుల్లో తీర్పులు వచ్చేలా ప్రవర్తిస్తున్నాయి.ప్రింట్ మీడియాను మనం ఫోర్త్ ఎస్టేట్ గా పరిగణిస్తాం. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1978 ప్రకారము ప్రింట్ మీడియా అనేది పనిచేస్తుంది. ప్రింట్ మీడియాతో పోల్చుకుంటే సోషల్ మీడియాకు ఎలాంటి బాధ్యతలు లేవు అని మన ప్రధాన న్యాయమూర్తి గారు ప్రస్తావించటం గమనార్హం.