Passenger Drone: ఇప్పటినుంచి హెలికాప్టర్ తో పనిలేదు
మనుషులు ప్రయాణించడానికి 290 కేజీల బరువు,14 అడుగుల పొడవు,16 ఎలక్ట్రిక్ మోటార్ లు ఉన్న ఈ డ్రోన్ లో మనుషులు కూర్చొని ఎగరవచ్చు. ఈ డ్రోన్ ని పూణేకి చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ తయారు చేసింది.
మనుషులని ఒక చోట నుంచి మరొక చోటికి ఆకాశంలో తీసుకుపోవడానికి దీనిని కనుగొన్నారు. ఇది దేశంలోనే ఆటోమేటిక్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎలక్ట్రిక్ క్రాఫ్ట్ అని దీనిని నడిపించడానికి ఎవరి సహాయం అవసరం లేదు. అయినప్పటికీ ఈ ట్రై ఫ్లైట్ దీనిని మాన్యువల్ గా ఆపరేట్ చేస్తున్నారు.
ఈ డ్రోన్ భూమి నుండి సుమారు 50 అడుగుల ఎత్తు లో ప్రయాణిస్తుందని. ఈ డ్రోన్ గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ డ్రోన్ సుమారు 500 ఎత్తువరకు ఎగరగలదు. ప్రస్తుతానికి ఈ డ్రోన్ ని మెడికల్ ఎమర్జెన్సీ కోసం తయారు చేశారు. కావున ఇది దూరప్రాయాలకు ఉపయోగపడదు.
త్వరలోనే ఇది ప్యాసింజర్ డ్రోన్ గా వస్తుందని కంపెనీ వారు చెబుతున్నారు. దీనిలో ప్రయాణం చేస్తున్న సమయంలో మూడు రెక్కలు ఆగిపోయిన కూడా మిగతా వాటితో ఆగిపోకుండా ప్రయాణం చేయగలదు. ఈ డ్రోన్ కి నాలుగు ఆటో పైలెట్లు ఉన్నాయి.
అందులో ఒకటి ఫెయిల్ అయిన కూడా మిగతా మూడు పనిచేస్తాయి. బ్యాటరీ విషయానికొస్తే 50% అయిపోయిన వెంటనే ఎమర్జెన్సీ లోకి వస్తుంది. చార్జింగ్ పూర్తిగా అయిపోయిన సరే ఇందులో ఉన్న పారాషూట్ జాగ్రత్తగా కిందికి దించుతుంది.
విమానానికి రెండు మూడు ఇంజన్లు పక్షి పూర్తిగా ఇంజన్లోకి వెళితే ఇంజన్ ఆగిపోతుంది కానీ ఈ డ్రోన్ కి 16 ఇంజిన్లు కావున ఈ డ్రోన్ ప్రయాణం చేస్తున్న సమయంలో పక్షి ఒక మోటర్ ఒక ప్రొఫైల్ కి తగిలి డ్రోన్ రెక్క సగం విరిగిన ఇది ఎగరటానికి వీలుగా వుంటుంది.