Puneeth Rajkumar: తెలుగు రాష్ట్రంలో పునీత్ రాజ్‍కుమార్ భారీ విగ్రహం
Ppuneeth rajkumar: పునీత్ రాజ్‍కుమార్ గుర్తుగా గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగుల ఫైబర్(fiber) గ్లాస్ విగ్రహాన్ని కట్టించారు. తెనాలికి నగరానికి సంబందించిన కొందరు శిల్పులు కే వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి ఈ భారీ విగ్రహాన్ని చేశారు.
21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీతో ఈ విగ్రహాన్ని చేసినట్లు తెలిపారు. దివంగత కన్నడ పవర్ స్టార్ హీరో, పునీత్ రాజ్ కుమార్ ఈలోకాన్ని విడిచిపోయి ఈరోజుకి సంవత్సరం అయ్యింది. అయితే పునీత్ లేడన్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు మరియు అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.
ఓవైపు సినిమాలు మరోవైపు సామాజిక సేవా చేస్తూ అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్న పునీత్. అయితే చిన్న వయసులోనే హార్తట్టాక్ గురై ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. గతేడాది ఇదే రోజ అప్పు తన తుదిశ్వాస విడిచారు.
ఈ సంద్భంగా పునీత్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు మరియు అభిమానులు కొత్త కార్యక్రమాలు చేస్తున్నారు. కాగా అప్పు కన్నడతో పాటు యావత్తు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
తెలుగునాట కూడా ఆయనకు అశేష అభిమానగణం ఉంది. ఈ నేపథ్యంలో పునీత్ రాజ్‍కుమార్ గుర్తు గా గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగుల ఫైబర్ గ్లాస్ (fiber glass) విగ్రహాన్ని రెడీ చేశారు.
తెనాలికి చెందిన శిల్పులు కే వెంకటేశ్వరరావు, రవిచంద్ర మరియు శ్రీహర్ష లు కలిసి ఈ భారీ విగ్రహాన్ని సిద్దం చేశారు. 21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీతో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు సమాచారం అందుతుంది.