దేశీయ ఎలక్ట్రానిక్స్ కంపెనీ పిట్రాన్ (Ptron) యూత్ కోసం ఓ సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను తీసుకొచ్చింది. ఇది పూర్తి లోడెడ్, స్టైలిస్ స్మార్ట్‌వాచ్. అల్ట్రాసిమ్, లైట్ డిజైన్, సులభంగా ఉపయోగించుకోగల హెల్త్ మేనేజ్‌మెంట్ ఫీచర్లతో వస్తున్న ఈ వాచ్ పేరు ‘పిట్రాన్ ఫోర్స్ X10’(Ptron Force X10).
ఈ వాచ్ ద్వారా ఆరోగ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇందులో 1.7 అంగుళాల హెచ్‌డీ ఫుల్ టచ్ కలర్ డిస్‌ప్లే, 2.5డి కర్వ్‌తో ఆకర్షణీయంగా ఉంది. వాచ్ విడుదల సందర్భంగా పిట్రాన్ వ్యవస్థాపకుడు, సీఈవో అమీన్ ఖ్వాజా మాట్లాడుతూ.. ‘పిట్రా ఫోర్స్ X10’ను చాలా సరసమైన ధరలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఇది ఆరోగ్యం, ఫిట్‌నెస్, ఫ్యాషన్ లక్ష్యాలను నెరవేర్చే డిజైన్‌గా మారుతుందని అన్నారు.
పిట్రాన్ ఫోర్స్ X10 స్మార్ట్‌వాచ్ అండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం పిట్రాన్ సొంత పిట్రాన్ ఫిట్+ యాప్‌తో వస్తోంది. నాలుగు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో గ్లామ్ బ్లాక్, ప్యూర్ బ్లాక్, స్పేస్ బ్లూ అండ్ స్వెడ్ పింక్ ఉన్నాయి. లాంచింగ్ ఆఫర్ కింద ఫోర్స్ X10 అమెజాన్ ఇండియాలో రూ. 1499కే సొంతం చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 4న (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక లాంచ్ ఆఫర్‌గా కింద మొదటి 100 మంది కస్టమర్‌లు ఫోర్స్ X10ని 99 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.