Hero Splendor electric bike: భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే ద్విచక్ర వాహనాలలో హీరో స్పెండర్ ప్లస్ కూడా ఒకటి. ఇతర బైక్ లతో పోలిస్తే బైక్ ధర, మెయింటినెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది.
అందుకే ఎక్కువగా సామాన్యులు దీనిని కొనడానికి ఇష్టపడుతుంటారు. అయితే పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు వాహనాలను బయటికి తీయాలి అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది.
అయితే సామాన్య ప్రజలు వీటి నుండి బయటపడేలా హీరో స్ప్లెండర్ బైక్ కోసం EV కన్వర్షన్ కిట్ ను భారతదేశ మార్కెట్లో విడుదల చేసింది. తమకు ఇష్టమైన బైకులలో ఈ ఎలక్ట్రిక్ కిట్టును ఇన్స్టాల్ చేయటం ద్వారా డబ్బులను ఆదా చేసుకోవచ్చు.
ఈ ఎలక్ట్రిక్ కిట్టును ఉపయోగించవచ్చని ఆర్టీవో వద్ద ఆమోదం కూడా లభించింది. ఇటీవల మహారాష్ట్రలోని థానే కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రిక్ వాహన స్టార్ట్ప్ కంపెనీ గోగో ఏ1ను ఇటీవల లంచ్ చేసింది. దాని ధర సుమారుగా ₹35,000/- ఉంటుంది.
అయితే దీని అసలు తో పాటు ₹6,300/- జీఎస్టీని కూడా చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా బ్యాటరీ ఖర్చును విడిగా చెల్లించవలసి ఉంటుంది. మొత్తం మీద EV కన్వర్షన్ కిట్ బ్యాటరీ తో కలిపి దీని యొక్క ధర సుమారుగా ₹95,000/- ఉంటుంది.
హీరో స్పెండర్ ప్లస్ బైక్ తో పాటు EV కిట్ ను కొనడానికి అదనంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. హీరో కంపెనీ తనకిట్టుపై మూడు సంవత్సరముల వారంటీని కూడా ఇస్తుంది.
ఈ గొగో ఏ1 ఎలక్ట్రిక్ కిట్టు సాయంతో ఈరోజు స్పెండర్ ప్లస్ ద్విచక్ర వాహనం 151 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం భారత దేశంలో ప్రముఖ కంపెనీలు ఇలాంటి ఎలక్ట్రిక్ బైక్ ను ఇంకా లాంచ్ చేయలేదు.