త్వరలో మంత్రివర్గ విస్తరణ
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం దిశ గా అడుగులు వేస్తున్నారు.
రెండున్నర ఏళ్ల తర్వాత తన క్యాబినెట్ లో మార్పులు ఉంటాయని.. తొలి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దాదాపు 90 శాతం మందిని మారుతారని స్పష్టం చేశారు. మరికొద్ది నెలలుగా కేబినెట్లో మార్పులు జరుగుతాయని జోరుగా పార్టీలో ప్రచారం కొనసాగుతుంది.
కొత్తవారికి అవకాశాలు దక్కేదెవరికి అనిలెక్కలు వేస్తున్నారు.జగనన్న మాత్రం తన మార్క్ నిర్ణయాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే జగన్ పాలన ఇరవై ఆరు నెలలు పూర్తి చేసుకుంది. 2019 ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు క్యాబినెట్ రూపకల్పన చేశారు.
ఇదే సమయంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తూ గుర్తింపు రాలేదని సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం చాలా మంది సీనియర్ పార్టీ నాయకులలో నెలకొంది.
ప్రభుత్వంతో పాటు పదవులు కీలకం అందుకోసం కొత్త నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.
కేంద్రం క్యాబినెట్ విస్తరణ సమయంలో ప్రధాని మోదీ అనుసరించిన ఫార్ములాలను సీఎం జగన్ ఫాలో అయ్యే అవకాశం ఉంది.