ఆన్లైన్లో సినిమా టికెట్లు అమ్మాలని చెప్పింది సినీ పెద్దలే: మంత్రి పేర్ని నాని


సినిమా టికెట్లను ఆన్లైన్లో అమ్మ ఎందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పోర్టల్ ను సిద్ధం చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై ఇండస్ట్రీకి చెందిన కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. సినిమా టికెట్ లను ప్రభుత్వం అమ్మాలనే అంశంపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఈ అంశంపై కమిటీలు వేస్తామని…అని దీనిపై ఇంకా అధ్యయనం కొనసాగుతుందన్నారు.

ఈ విషయం పై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. దుష్ప్రచారాలు చేయొద్దని అందరి కోరుతున్నామని పేర్ని నాని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ మంచి పని చేయాలనుకున్నా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆన్లైన్లో సినిమా టికెట్లు అమ్మాలని సినిమా ప్రముఖుల కోరారు.

వారి సూచనలను ప్రభుత్వం పరిశీలించిఉందని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
బ్లాక్ టికెట్లను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. కొందరు పన్నుల ఎగ వేస్తున్నారని విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. సినీ పరిశ్రమ పెద్దల తో ముఖ్యమంత్రి జగన్ భేటీ అవుతారని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతో ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తుందని మంత్రి పేర్ని నాని తెలిపారు.