ఏపీ ప్రభుత్వానికి కేంద్రం తీపి కబురు..



AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం తీపికబురు చెప్పింది. రాష్ట్రానికి అదనపు రుణ సమీకరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మూలధన వ్యయం లక్ష్యాన్ని చేరుకున్న రాష్ట్రాలకు కేంద్రం రుణ ప్రోత్సాహకాలు ప్రకటించింది. మూలధన వ్యయం లో తొలి త్రైమాసికంలో ఆంధ్ర ప్రదేశ్ 15 శాతం టార్గెట్ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో 2021- 2022 త్రైమాసిక- 1లో సమీకరణకు అంగీకారం తెలిపింది. అందులో భాగంగా రాష్ట్రానికి రూ.2,665 కోట్ల రుణ సమీకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

దీంతోపాటు మార్కెట్ నుంచి అదనంగా రూ.15,722 కోట్ల రుణ సమీకరణ చేసుకోవచ్చని వెల్లడించింది. అలాగే ఏపీకి జిడిపిలో 4 శాతం నికర రుణాలు పరిమితి పై 0.50 శాతం కేంద్రం ప్రోత్సాహకం ఇచ్చింది. దేశవ్యాప్తంగా మూలధన వ్యయల లక్ష్యాన్ని చేరుకున్న ఆంధ్రప్రదేశ్ తో పాటు 11 రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది.