ఐదుగురు ఐఏఎస్ లుకు జైలు శిక్ష,జరిమానా ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు

కోర్టు దిక్కరణకు పాల్పడిన ఐదుగురు ఐఎఎస్ లకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు.

అమరావతి: ఏపీ హైకోర్టు మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది.

నెల్లూరు (జిల్లా) తాళ్ళపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళ నుండి రాష్ట్ర ప్రభుత్వం భూమిని తీసుకుంది. అయితే భూమికి సంబంధించిన వివరాలు నష్ట పరిహారం ఇవ్వకపోవడంతో సదరు మహిళ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం విచారణ జరిపించి మహిళకు నష్టపరిహారం చెల్లించాలని చాలా క్రితం హైకోర్టు అధికారులను ఆదేశించింది. ఇప్పటి వరకు ఆమెకు కు నష్ట పరిహారం అందకపోవడంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. తాము ఆదేశించిన తర్వాత బాధిత మహిళకు నష్టపరిహారం చెల్లించడంలో ఆలస్యం చేయడంపై హైకోర్టు ఆగ్రహించింది. ఎందుకు కారణమైన కారకులుగా భావిస్తూ ఐదుగురు ఐఏఎస్ ల కు జైలు శిక్ష విధించి జరిమానా విధించింది. ఇదే కాకుండా ఐఏఎస్ అధికారులు జీతాలు నుంచి డబ్బులు కట్ చేసి బాధిత మహిళకు నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.

 ఇక అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరి బాబుకు కూడా రూ.1000 జరిమానా, రెండు వారాలు జైలు విధించారు.రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ కు నెల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించింది న్యాయస్థానం. అలాగే ఐఏఎస్ లు S.S రావత్ కు నెల రోజుల జైలు రూ.1000 జరిమానా, ముత్యాల రాజుకు రెండు వారాల జైలు రూ.1000 జరిమానా,మరొక ఐఏఎస్ కు రెండు వారాల జైలు శిక్షను విధించింది హైకోర్టు. ఈ శిక్షపై అప్పీల్ చేసేందుకుగాను నెలరోజుల శిక్షతో పాటుగా సస్పెండ్ చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.

ఇటీవలే కోర్టు ధిక్కరణ నేరంపై ఇద్దరు ఐఎఎస్ లకు జైలు శిక్ష విధించిన, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు విషయం తెలిసిందే. ఐఏఎస్ అధికారులు గిరిజా శంకర్, చిరంజీవి చౌదరి వారం పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు,రెగ్యులైజ్ విషయంలో తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం దీనిని కోర్ట్ ధిక్కరణ నేరంగా పరిగణిస్తూ ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష విధించింది. అయితే కోర్టు ఆదేశాలను అమలు త్వరగా చేస్తామని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో ఐఏఎస్ అధికారులు అరెస్టులు వెనక్కి తీసుకుంది.