గణేష్ నిమజ్జనం బందోబస్తు ఏర్పాట్లు, భద్రతను సమీక్షించిన జిల్లా యస్.పి
తిరుపతి అర్బన్ జిల్లా: తిరుపతి గణేష్ నిమజ్జనం బందోబస్తు ఏర్పాట్లు, భద్రతను సమీక్షించిన జిల్లా యస్ పి శ్రీ వెంకట అప్పల నాయుడు ఐ.పి.యస్ గారు.
వినాయక సాగర్, చెన్నయ్య గుంట నిమజ్జనం ప్రాంతాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు సూచనలు. ఇతర ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుని ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు. తిరుపతి నగరంలో వినాయక నిమజ్జనం బందోబస్తు, ఏర్పాట్లను తిరుపతి అర్బన్ జిల్లా యస్ పి గారు వినాయక సాగర్ వద్ద అధికారులతో కలిసి సమీక్షించారు.
తిరుపతి నగరంలోని నిమజ్జన ప్రాంతాలు వినాయక సాగర్, చెన్నయ్య గుంట ఘాట్ల వద్ద ఈరోజు పర్యటించి ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు అధికారులకు జారీ చేశారు. రాష్ట్ర హైకోర్టు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు మరియు కోవిడ్ నిబంధనల అమలయ్యేలా చర్యలు తీసుకోవాలనీ అధికారులకు సూచనలు చేసారు.
మున్సిపల్ , రెవెన్యూ, విద్యుత్ , అగ్నిమాపక శాఖ అధికారులతో సమన్మయం ఏర్పరుచుకొని నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
భద్రతా పరమైన అన్ని ఏర్పాట్లు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. ఈ రొజు మూడవ రోజు కారణంగా అదిక సంఖ్యలో నిమజ్జనం చేయడానికి అందరు తరలి వస్తారు కావున ప్రజలందరూ భాద్యతగా నిభందనలను పాటిస్తూ నిమజ్జనొత్సవాలలో పాల్గొనాలని జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు తెలిపారు.