Tirupati: చంద్రగిరి నియోజకవర్గం లో కాబోయే వధూవరులకు ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి పెళ్లి కానుక అందజేశారు. ఒక్కో జంటకు దాదాపు 20 వేల తో బంగారు తాళిబొట్టు, వెండి మెట్టెలు, పట్టు వస్త్రాలను ఇస్తున్నారు.
తొలుత తిరుపతి రూరల్ మండలం లోని తుమ్మలగుంట లోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వివాహం చేసుకునే వారికి అందజేశారు. చంద్రగిరి నియోజకవర్గం లో జంట ఎక్కడ వివాహం చేసుకున్న ఈ పెళ్లి కానుక అందించాలని నిర్ణయించారు.
ఈ మేరకు సోమవారం తుమ్మలగుంట లో తొలిసారి 7 జంటలకు ఈ కానుకను టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అందజేసి ప్రారంభించారు. కాబోయే జంటల వివాహానికి సంబంధించిన ఆధారాలు చూపించి ఈ కానుకను పొందవచ్చని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. అంతకుముందు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో పేరూరు మాజీ సర్పంచ్ మూలం చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.