బోణీ కొట్టిన వైసీపీ
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా కోవూరులో తొలి ఫలితం వెలువడింది. ఆ ప్రాంతంలోని వైసిపి బోణీ కొట్టింది.
ఆమంచర్ల ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్థి 760 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సౌత్ మోపూరు స్థానం లోను వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. బ్రహ్మయ్య ఇంజనీరింగ్ కాలేజీలో కొవ్వూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు చెందిన ఓట్లు లెక్కిస్తున్నారు.
సాయంత్రం నాలుగు గంటలకి కౌంటింగ్ పూర్తి కానుంది. ఇతర ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అనంతపురం జిల్లా మడకశిర లో ట్రాఫిక్ ఎస్ఐ గా పనిచేస్తున్న అంజాద్ ఆలీ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనను ఆసుపత్రికి తరలించారు. కరోనా నేపథ్యంలో ర్యాలీలు విజయోత్సవ లపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది.