బ్యాలెట్ బాక్సుల్లో వాననీరు… తడిచిన ఓట్లు



గోలుగొండ (విశాఖ):గోలుగొండ ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్ పక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ బాక్స్ లు ఓపెన్ చేసే సమయానికి పాకలపాడు లింగంపేట బ్యాలెట్ బాక్సుల్లో వాననీరు చేరడంతో ఉన్న ఓట్లు తడిసిపోయాయి.

పాకలపాడు బ్యాలెట్ బాక్స్ లు ఆరు ఉండగా అందులో మూడు బాక్సులో నీ ఓట్ల లెక్కింపు వీలు కాకుండా పాడయ్యాయి. దీనిని అధికారులు ధ్రువీకరించారు. ఈ సెగ్నెంట్ లెక్కింపు ప్రక్రియ ఏమవుతుందో అని ఉత్కంఠ నెలకొంది.