యస్. డి. జి. యస్. కలాశాలలో న్యాక్ బృందం పరిశీలన
యస్. డి. జి. యస్. కలాశాలలో ముగిసిన న్యాక్ బృందం పరిశీలన
హిందూపురం :
పట్టణములోని యస్. డి.జి.యస్. కలాశాలలో నిన్న ప్రారంభం అయిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్, న్యాక్ బృందం పరిశీలన నేటితో ముగిసింది. పరిశీలన నిమిత్తం
డిల్లీ నుండి వచ్చిన జామియా అమ్దర్ద్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అఫ్సర్ ఆలం, అలిగర్ ముస్లిం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జావేద్ అక్తర్, డెహ్రడూన్ నుండి వచ్చిన డి.ఎ.వి. కలాశాల ప్రిన్సిపాల్ అజయ్ సక్సేన కలాశాల లోని నాణ్యత ప్రమాణాలు, వాటికి సంబంధించిన ఆధారాలను, అధ్యాపకుల వివరాలను, విధ్యార్థుల వివరాలు, సాంకేతిక పరికరాలను, ఇతర వివరాలు పరిశీలించారు.
చివరగా ఏర్పాటు చేసిన ఎగ్జిట్ మీటింగు లో బృందం సభ్యులు మాట్లాడుతూ అన్ని అంశాలు సంతృప్తి కరంగా ఉన్నాయని, కలాశాల కమిటీ వారిని, ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకును, విధ్యార్థులను ప్రశంసించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన విషయాలపై సూచనలను తెలియజేసినారు. రెండు రోజులు జరిపిన పరిశీలన యొక్క నివేదికను సీల్డ్ కవర్ నందు కలాశాల ప్రెసిడెంటు రాం కుమార్, కార్యదర్శి అనిల్ కుమార్, కోశాధికారి మధుసూధన్గా, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ నాగేంద్ర కుమార్ గార్లకు అందజేశారు. త్వరలో కలాశాలకు న్యాక్ గ్రేడ్ ప్రకటిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో కలాశాల అధ్యాపకులు, విధ్యార్థులు పాల్గొన్నారు