సచివాలయ వ్యవస్థతో యునిసెఫ్ జత..




ఇందుకోసం ప్రతి జిల్లాలో ఒక్కో కోఆర్డినేటర్ ను నియమించిన యూనిసెఫ్

•గ్రామ,వార్డు సచివాలయ శాఖ 3 ప్రతినిధులతో కూడిన ప్రత్యేక సెల్

• ఈ ఏడాది డిసెంబర్ వరకు కోవిడ్ అవగాహన కార్యక్రమాలు పైనే దృష్టి

Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తో కలిసి పని చేసేందుకు ఐక్యరాజ్యసమితి కి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి (unicf) ముందుకు వచ్చింది.

ఇందుకోసం ప్రతి జిల్లాలో ఒక్కొక్కరిని ప్రతినిధి యూనిసెఫ్ నియమించింది. వీరు ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ కార్యాలయం కేంద్రంగా పని చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ కార్యాలయం లో మరో ముగ్గురు యూనిసెఫ్ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక సెల్ పనిచేస్తుంది. ఈ ఏడాది నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. జిల్లా,రాష్ట్ర స్థాయిలో పనిచేసే యూనిసెఫ్ ప్రతినిధులకు ఆ సమస్తే జీతాలు చెల్లిస్తుంది. పిల్లలకు పౌష్టికాహారం, విద్య, వైద్యం వంటి విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సేవల కల్పించడం లక్షణాలు యూనిసెఫ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. రెండేళ్లుగా రాష్ట్రప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ఆసరాగా చేసుకుని రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలు సైతం మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు యూనియన్ ప్రతినిధులు తో క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.యూనిసెఫ్ జిల్లా స్థాయిలో తమ ప్రతినిధులు నియమించడం ఇదే తొలిసారి అని అధికార వర్గాలు తెలిపాయి.

వచ్చే ఏడాది జనవరి నుంచి పిల్లలకు పోషకాహారం, దాని ఆవశ్యకత పౌష్టికాహార లోపం వల్ల కలిగే దుష్ఫలితాల పై వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు,యూనిసెఫ్ స్టేట్ మేనేజర్ మోహన్ రావు వివరించారు. గ్రామ,వార్డు సచివాలయ సిబ్బందితో పాటు 2.58 లక్షల మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. శిక్షణానంతరం అన్ని పాఠశాలలో యునిసెఫ్ ప్రతినిధులు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో కలిసి విద్యార్థులకు కరోన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారని వివరించారు.