AP Sachivalayam probation:సచివాలయ కార్యదర్శులకు ప్రొబేషనరీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ,వార్డు సచివాలయాల్లో కార్యదర్శులకు ప్రొబేషనరీ ప్రకటించాలని,రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ పూర్తయినట్లు ప్రకటించేందుకు జిల్లాలో అవసరమైన చర్యలు చేపట్టాలని,గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కలెక్టర్లను ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1.34 లక్షల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియ ద్వారా జిల్లాల కలెక్టర్లు నేతృత్వంలో సెలెక్ట్ కమిటీ (DSC) ల ఆధ్వర్యంలో లో జరిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో 20 విభాగాల్లో 11 విభాగాల ఉద్యోగులు సర్వీసు రూల్స్‌ ప్రకారం డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు పాస్‌ కావాల్సి ఉంటుంది.

ఈ ప్రక్రియలో అక్టోబర్ 2 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారి వివరాలతో పాటు పోలీస్ వెరిఫికేషన్, డిపార్ట్మెంట్ టెస్ట్ ఉత్తీర్ణత వివరాలను సిద్ధం చేసి ఉంచాలని, వాటిని నిర్ణీత ఫార్మెట్లో గ్రామ వార్డు సచివాలయ శాఖకు తెలియజేయాలని అజయ్ జైన్ కలెక్టర్ ను కోరారు.