ఏపీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వార్డు సచివాలయాలు సచివాలయ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 2 నాటికి సచివాలయ ఉద్యోగులకు ప్రొహిబిషన్ పీరియడ్ డిక్లేర్ చేయాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు,అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చైర్మన్ కె.రామ్ రెడ్డి సచివాలయ ఉద్యోగులు ప్రొహిబిషన్ పీరియడ్ ను పూర్తిచేసుకుని వెంటనే రెగ్యులర్ పే స్కేల్ పరిధిలోకి వస్తారని తెలిపారు.
విజయవాడలో జరిగిన ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమావేశంలో తెలిపారు.వైసిపి అధికారంలోకి రాగానే భారీ ఉద్యోగ నోటిఫికేషన్ కు విడుదల చేసింది.1.34 లక్షల ఉద్యోగాలు సచివాలయాల్లో కల్పించింది. లక్ష మందితో నవంబర్ నెలలో కృతజ్ఞత సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డిపార్ట్మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అందరికీ ప్రొహిబిషన్ డిక్లేర్ చేస్తారని తెలిపారు.డిపార్ట్మెంట్ టెస్ట్ లేని ఎనిమిది శాఖలను ఎలాంటి పరీక్షలు లేకుండా ప్రొహిబిషన్ డిక్లేర్ చేయాలని కోరారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు దినాలను పని దినాలు గా వారికి కూడా ప్రొహిబిషన్ డిక్లేర్ చేయాలని కోరారు.