ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
రేషన్ కార్డు బయోమెట్రిక్ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రేషన్ కార్డుల బయోమెట్రిక్ సంబంధించిన ఏపీ ప్రభుత్వం ఒకే సభ్యుడికి ఉండే రేషన్ దారులకు ఒకవేళ వారు బయోమెట్రిక్ పడకపోతే వాలంటీర్ల ద్వారా బయోమెట్రిక్ వేసి సరుకులు తెచ్చుకోవచ్చని ఏపీ పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.
ఒకవేళ రేషన్ కార్డులు ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే బయోమెట్రిక్ రాకపోతే మరొకరు బయోమెట్రిక్ నుంచి రేషన్ సరుకులు తెచ్చుకోవచ్చని నిర్ణయం తీసుకుంది. బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రల పడక పోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.