వైసిపి నేత, మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్ అరెస్ట్…
చిట్ ఫండ్ మోసం కేసులో వైసిపి నేత, మాజీ ఎమ్మెల్యే, ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముళ్ళ విజయప్రసాద్ అరెస్టయ్యారు. చిట్ ఫండ్ కేసులో ఆయన ఒడిస్సా సిఐడి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వెల్ఫేర్ సంస్థ,పేరుతో విజయ ప్రసాద్ రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్ వ్యాపారం చేస్తున్నారు.
ఏపీ తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా బ్రాంచీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఒడిశాలోని చిట్ ఫండ్ వ్యాపారం చేశారు. అక్కడ డిపాజిట్ దారులకు సక్రమంగా చెల్లింపులు జరగకపోవడంతో ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. అందుకే ఒడిస్సా పోలీసులు రెండేళ్ల కిందట కేసు నమోదు చేశారు. ఈ మేరకు సిఐడి పోలీసులు విశాఖపట్నానికి వచ్చారు.
ముళ్ళ విజయ్ ప్రసాద్ ను స్థానిక ఉన్నతాధికారుల అనుమతితో ఒడిస్సా సిఐడి పోలీసులు ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్థానిక పోలీసులు చెబుతున్నారు.