AP broadband services: 2022 కల్లా ప్రతి పల్లెకు బ్రాడ్ బ్యాండ్…



అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్ని పట్టణాలతో పాటు ప్రతి గ్రామానికి మెరుగైన బ్రాండ్బ్యాండ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు.

విజయవాడ సి ఎస్ క్యాంపు కార్యాలయంలో సోమవారం స్టేట్ బ్రాండ్ బ్యాండ్ కమిటీ రెండవ సమావేశం సిఎస్ అధ్యక్షతన జరిగింది. సి ఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 2022 నాటికి నేషనల్ బ్రాండ్ బ్యాండ్ మిషన్ కింద ప్రతి గ్రామానికి హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని,కేంద్ర లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో అన్ని గ్రామాలకు త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఐటీ విధానం కూడా దోహదం పడుతుందని CS తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ రీసర్వే ప్రక్రియలో బ్రాడ్బ్యాండ్ సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని డిజిటలైజేషన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. మారుమూల గ్రామాలు మరియు గిరిజన ప్రాంతాలలో బ్రాడ్ బ్యాండ్ సేవలను విస్తీరణ కు అటవీశాఖ క్లియరెన్స్లు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని సిఎస్ గారు తెలిపారు. ఈ సమావేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రామకృష్ణ, రాఘవేంద్రరావు వారు కూడా మాట్లాడారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయలక్ష్మి. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker