Jagananna Vidya Kanuka: ఏపీ విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త



Amaravati: ఏపీ లోని విద్యా కానుక లబ్ధిదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం. వచ్చే ఏడాది నుంచి స్పోర్ట్స్ షూ తో పాటు స్పోర్ట్స్ డ్రెస్ కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

నాడు-నేడు ఫౌండేషన్ స్కూల్ ల పై జరిగిన సమీక్షలు ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం సూచించిన నూతన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు ఏపీ ప్రభుత్వం. ఫౌండేషన్ స్కూల్ లో ప్రత్యేకంగా దృష్టి పెట్టడం. నాడు నేడు పై సమీక్ష జరిపిన సీఎం జగన్ గారు, రెండో విడతలో 12 వేలకు పైగా స్కూల్ లో పనులు చేపట్టాలని ఆదేశించారు.

రెండో దఫా నాడు నేడు పనులు కోసం టెండర్ల ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని సూచించారు. అలాగే CBSE తో పాటు ICSE అఫిలియేషన్‌కు సంబంధించి కూడా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. మరోవైపు జగనన్న విద్యా కానుక కింద వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు స్పోర్ట్స్ షూ తో పాటు ప్రత్యేక స్పోర్ట్స్ డ్రెస్ ను పంపిణీ చేయబోతుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి డిజైన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker