ఏపీ ఉద్యోగులకు షాక్. బయోమెట్రిక్ హాజరు ఇక నుంచి తప్పనిసరి
అమరావతి: రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును ఇక నుంచి తప్పనిసరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు ఉత్తర్వులు సిఎస్ ఆదిత్య దాస్ జారీ చేశారు.
కోవిడ్ కారణంగా 2020 మే నెలలో బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం. ఆగస్టు నెల 13న జరిగిన కార్యదర్శుల సమావేశంలో బయోమెట్రిక్ తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
సచివాలయం తో పాటు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగులు బయోమెట్రిక్ పరికరాలను సిద్ధం చేయాలని ఐటీ శాఖను సిఎస్ ఆదేశించారు. సచివాలయం సహా, హెచ్ ఓ డి కార్యాలయాలు, జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయాలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర విభాగాలు తప్పనిసరిగా బయోమెట్రిక్ నమోదు చేయాలని సూచించారు. ప్రతి కార్యదర్శి ఉద్యోగులకు హాజరు బయోమెట్రిక్ ద్వారా పరిశీలించాలని, సిఎస్ సూచనలు చేశారు. ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సిఎస్ ఆదిత్యనాథ్ దాస్.