ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు


మొదటి బోణీ కొట్టిన వైసీపీ

ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కొనసాగుతుంది. ఈ క్రమంలో వైఎస్ఆర్ జిల్లాలో ఎంపీటీసీ అభ్యర్థి విజయం సాధించి మొదటి బోణీ కొట్టారు.

వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం దేవరాజు పల్లె ఎంపీటీసీ 221 ఓట్లు పోలయ్యాయి. వాటిలో ఇన్ వాలిడ్ 17, టీడీపీ-5 వైసీపీ-191 కి వచ్చాయి. దీంతో 186 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి విజయ సంకేతం ఎగరవేశారు.

ప్రస్తుతం అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా బ్యాలెట్ బాక్స్ లకు చెదలు పట్టాయి.సరుబుజ్జిలి మండలం షలంతరి ఎంపీటీసీ స్థానానికి సంబంధించిన పోలింగ్ బూత్, ఆముదాలవలస నియోజకవర్గం పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్స్ కు చెదలు పట్టాయి. దీంతో ఆ జిల్లా
కలెక్టర్ శ్రీ కేష్ బీ లాఠకర్ విచారణకు ఆదేశించారు.
ప్రస్తుతం JC సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో చెద పట్టిన బూత్ లోనీ బ్యాలెట్ లను అధికారులు పరిశీలిస్తున్నారు.

ఏపీలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలు, 660 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. నోటిఫికేషన్ జారీ సమయంలో…375 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మొత్తం 9672 స్థానాల్లో నోటిఫికేషన్ విడుదల కాగా, 2,371 ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో అభ్యర్థులు మృతితో 81 స్థానాల్లో పోలింగ్ నిలిచిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న 7220 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 18,782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నేడు వారి భవిత్వం తేలనున్నది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker