ఏపీలో చప్పగా స్థానిక ఎన్నికల కౌంటింగ్ సందడి…
Amaravati: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల కౌంటింగ్ సందడి ఎక్కడ కనిపించడం లేదు. ఫలితాలపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడింది అంటూ తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరించింది.
పంచాయతీ ,మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవల కోసం వైసీపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక జడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికల్లో కూడా ఇలాగే వ్యవహరించింది. దీంతో పోటీపై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. కోర్ట్ గొడవలతో ఐదు నెలల తర్వాత ఇవాళ కౌంటింగ్ జరుగుతోంది. అసలు కౌంటింగ్ జరుగుతుందనే విషయం జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.