ఇల్లు పట్టాల కోసం కొత్త పథకం: 67 లక్షల మందికీ లబ్ధి
గృహ నిర్మాణం, ఉపాధి పనులు, వైయస్సార్ అర్బన్ క్లినిక్స్, గ్రామ,వార్డు సచివాలయ తనిఖీలు,
కోవిడ్ సహ సీజనల్ వ్యాధులు, దిశ యాప్, వ్యవసాయం, అక్టోబర్ నెలలో అమలు చేయనున్న పథకాలపై ఇవాళ సీఎం జగన్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ… ఇళ్ల పట్టాల పంపిణీ పై హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులపై దృష్టి పెట్టాలని, గత మీడియా కాన్ఫరెన్స్లో 834 కేసులుంటే… ఇవాల్టికి 758కి కేసులు తగ్గాయన్నారు. 76 కేసులు పరిష్కారం అయ్యాయని… దాదాపు 8 వేల మందికి దీని వల్ల మేలు జరుగుతుందని తెలిపారు. లేఅవుట్
వారీగా, ఫ్లాట్ ల వారీగా లబ్ధిదారుల వివరాలను తెలియజేస్తూ మ్యాపింగ్ చేశామని, మిగిలిపోయి నా 12.6 శాతం మ్యాపింగ్ పనులకు కలెక్టర్లు వెంటనే పూర్తి చేయాలని తెలిపారు.
1,46,398 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కోత్తగా భూసేకరణ చేయాల్సి ఉందని, వన్ టైం సెటిల్మెంట్ పథకానికి జగనన్న సంపూర్ణ గృహ పథకం పేరు మార్పు చేశామని వెల్లడించారు. ఈ పథకంలో రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా డిసెంబర్ లో చేయాలని, దాదాపు 67 లక్షల మందికి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. 1980 ల నుంచి 2011 వరకూ ఉన్న అన్ని ఇల్లు. ఇంటి స్థలాలు విడిపించుకునేల అవకాశం ఇస్తున్నారు.
పేదలందరికీ ఇళ్ల పథకం లో భాగంగా మొదటి విడతలో 15.6 లక్షల ఇళ్లు కడతామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 10.31 లక్షల ఇల్లు గ్రౌండ్ అయ్యాయని వెల్లడించారు. ఆప్షన్- 3 ని ఎంపిక చేసుకునే ఇళ్లు పనులు అక్టోబర్ 25 నుంచి మొదలు పెట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే 2.25 లక్షల లబ్ధిదారులతో 18,483 గ్రూప్ లు ఏర్పాటు చేశారని, ఈ నెలాఖరులోగా గ్రూపులు ఏర్పాటు పూర్తి కావాలని తెలిపారు.