అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచిన సర్కార్
కర్నూల్: రాష్ట్రంలో అగ్రిగోల్డ్ కట్టి పదివేల రూపాయలు లోపు డబ్బు కట్టి మోసపోయిన మూడు లక్షల 40 వేల మంది బాధితులకు 240 రూపాయలు, నగదు పంపిణీ చేసి జగనన్న ప్రభుత్వం వారికి న్యాయం చేసింది.
తాజాగా మన రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు 20 వేల రూపాయల లోపు కట్టిన 13 లక్షల 83 వేల 574 మంది అగ్రిగోల్డ్ బాధితులకు 500 కోట్ల సీఎం ఏం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రూపాయలను విడుదల చేశారు.
జగనన్న పాలనలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా బాధితులకు బాసటగా నిలుస్తుంది… మాట ఇస్తే తప్పకుండా మనస్తత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం మన జగనన్నది అని రుజువు చేసుకున్నారు.
పాదయాత్రలో, మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలుస్తూ ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 10వేల నుంచి 20 లోపు డిపాజిట్ దారులకు రెండో దశ చెల్లింపులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కర్నూల్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్. పి. కోటేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.