నిరుద్యోగులకు తీపికబురు…త్వరలోనే భారీగా పోలీసులు కొలువులు
AP: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆయన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బంది వివరాలతో కూడిన అమరులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎంతో అమూల్యమైన అని, ప్రజా ప్రాణరక్షణకై కర్తవ్యంగా భావించి కరోనా మహమ్మారి కి ఎదురొడ్డి సేవలందిస్తున్న అంకితభావం చిత్తశుద్ధి వెలకట్టలేనిది. సమాజం పట్ల సేవాగుణం, దేశ భద్రత కోసం పోలీసులు చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం అన్నారు. దేశంలో అంతర్గత శాంతిభద్రతలకు కోసం పోలీసులు తమ కుటుంబ జీవనాన్ని సైతం త్యాగం చేస్తున్నారన్నారు. పోలీసులు తమ విధి నిర్వహణలో కంటికి కునుకు లేదు,ఒంటికి విశ్రాంతి లేదు ప్రజా రక్షణకై శ్రమిస్తూ ఉంటారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… త్వరలోనే వారిని పోలీసులు శాఖ లో భారీగా కొలువులు రానున్నాయని తెలిపారు. అదేవిధంగా 2017 నుంచి బకాయిలు లో ఉన్న 15 కోట్లు విడుదల చేశామని, భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామని ప్రకటన చేశారు. హోంగార్డుల గౌరవ వేతనాలు పెంచామని, గ్రామ వార్డు సచివాలయంలో పదహారు వేల మంది మహిళా పోలీసులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ లు ప్రకటించామన్నారు.