తహసీల్దార్లకు ఉన్న ఆ అధికారం పోలీసులకు లేదు



Amaravati:CRPC Section-107 కింద నమోదైన కేసును కొట్టివేయాలని, దాఖలైన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ జరిగింది. అనంతపూర్ జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో CRPC section-107 కింద నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని, పరశురాముడు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.

అల్లర్లు సృష్టించే వారిని సిఆర్ పి సి సెక్షన్-107 కింద బైండోవర్ చేసే అధికారం ఎమ్మార్వోలకు ఉందని, వారి అధికారాన్ని పోలీసులు లాగేసుకుంటున్నారు అని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. section-107 కింద పోలీసులు లక్షల మందిపై కేసులు పెడుతున్నారని కోర్టుకు వివరించారు.

వాదనలు విన్న న్యాయస్థానం సీఆర్పీసీ సెక్షన్ -107 కేసులు నమోదు చేయొద్దని ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని PS ఎస్ఐలకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని ఏపీ డీజీపీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పిటిషనర్ పై ఆత్మకూర్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ ను హైకోర్టు కొట్టేసింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker