ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం…
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం తీపి కబురు చెప్పింది. మరిన్ని అప్పులు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో ఓపెన్ మార్కెటింగ్ బారోయింగ్స్ లిమిటును, రూ.10.500 కోట్ల మేర పెంచింది. తొమ్మిది నెలల పరిమితిని రూ. 31.25 కోట్లును పెంచుతూ అనుమతులు ఇచ్చింది.
2021- 22 ఆర్థిక సంవత్సరం మొత్తం అప్పుల తీసుకునేందుకు వెసులుబాటు రూ.42.472 కోట వరకు ఉందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు(RBI) కి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం అందించింది. కేంద్రం నిర్ణయంతో అదనంగా ఏపీకి మరో రూ.10.500 కోట్ల మేర రుణాలు సమీకరణ చేసుకునేందుకు అవకాశం ఉండనుంది.
సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో రూ.10.500 కోట్ల రుణం తీసుకునేందుకు కు ఏపీకి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయంతో జగన్ సర్కార్ కు భారీ ఊరట లభించనుంది.