CM Review: జలవనరుల శాఖ పై సీఎం జగన్ సమీక్ష
తాడేపల్లి: ఈరోజు తాడేపల్లి లో క్యాంప్ కార్యాలయంలో జలవనరుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి రూ. 2,033 కోట్లు రావాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం నుంచి నిధులను వెంటనే రప్పించే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రగతిని అధికారులు వివరించారు. దిగువ కాపర్ డ్యాం పనులు, కాలువల అనుసంధానం వంటి అంశాలపై సమీక్ష జరిపారు.
పనులు వేగవంతం చేయాలని సూచించారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల పైన కూడా సమీక్ష నిర్వహించారు. రెండో టన్నెల్ పనులు వేగం పెంచాలని సీఎం ఆదేశించారు. కొల్లేరు వద్ద గోదావరి కృష్ణా డెల్టా రెగ్యులేటర్ నిర్మాణ పనుల్లో ప్రాధాన్యతా
క్రమంలో చేపట్టాలని ఆదేశించారు. తాండవ ప్రాజెక్ట్ విస్తరణ, కృష్ణానది బ్యారేజ్ నిర్మాణం పైనా దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.