CPS Rally: సిపిఎస్ రద్దు కోరుతూ భారీ నిరసన ర్యాలీ మరియు బహిరంగ సభ
CPS రద్దుపరచాలని సెప్టెంబర్ 1న ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఏపీ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీ జి.హృదయ రాజు మరియు రాష్ట్ర ఫ్యాప్టో సెక్రెటరీ శ్రీ కె. ప్రకాశ్ రావు గారి నాయకత్వంలో లో కర్నూలు లోని జిల్లా పరిషత్ (జెడ్పీ) కార్యాలయం నుండి ఎస్ టి బి సి కాలేజి వరకు వేయి మంది పైగా ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ర్యాలీ అనంతరం ఎస్ టి బి సి కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ జిల్లా FAPTO చైర్మన్ జె.సుధాకర్ అధ్యక్షతన కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించడమైనది.
సభను ప్రారంభిస్తూ FAPTO రాష్ట్ర కార్యదర్శి మరియు కర్నూలు జిల్లా ఇంచార్జి కె.ప్రకాష్ రావు ప్రసంగిస్తూ అధికారంలోకి రాక మునుపు అధికారమిస్తే వారం రోజుల్లో సి పి ఎస్ రద్దు చేస్తాను అని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సగం పదవీ కాలం అయిపోవచ్చినా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు అని వెంటనే సీపీస్ రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు.
APJAC సెక్రెటరీ జనరల్ శ్రీ జి.హృదయ రాజు ప్రసంగిస్తూ సి పి ఎస్ విధానం వలన ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఉద్యోగికి ఇచ్చే ఈ పెన్షన్ విధానము వలన వారి జీవితంలో ఖర్చులకు ఏ మాత్రం సరిపోని విధంగా నామమాత్రంగా వుందన్నారు. FAPTO వేదిక CPS అమల్లోకి వచ్చిన 2004 సెప్టెంబర్ 1 నుండి ప్రభుత్వంతో పోరాడుతూ అనేక ఉద్యమాలు చేయటం వలన గత ప్రభుత్వంలో గ్రాట్యుటి, ఫ్యామిలీ పెన్షన్ ను సంపాదించుకోగలిగామని అయితే సి పి ఎస్ రద్దు కొరకు ప్రభుత్వం పై ఉద్యమాలు చేస్తున్నామని, సీఎం ఇచ్చిన హామీ అమలు అయ్యేంతవరకు, సి పి ఎస్ విధానం రద్దు అయ్యే వరకు మా పోరాటాలను ఆపబోమని తెలిపారు.
FAPTO కర్నూలు జిల్లా పరిశీలకులు శ్రీ హెచ్.తిమ్మన్న గారు మాట్లాడుతూ FAPTO ఎల్లప్పుడూ ఉపాధ్యాయ మరియు ఉద్యోగుల పక్షాన ప్రభుత్వంతో పోరాడుతుంది కానీ ప్రభుత్వంనకు మరి ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు అని ఉద్యోగులకు సంబందించినంత వరకు పెన్షన్, డి ఏ లు మరియు పి ఆర్ సి అనేవి చట్టబద్ధమైనవి అని ప్రభుత్వం వాటిని కొంతకాలం అపవచ్చు కానీ నిరవధికంగా ఆపలేదు అని ,కొంత కాలం ఆపటం వలన ప్రభుత్వంనకు ఉద్యోగ వర్గాల్లో అప్రతిష్ట మరియు చెడ్డ పేరు వస్తుంది అని ప్రభుత్వ నేతలు ఇప్పటికైనా కళ్ళు తెరచి ఉద్యోగులు కోరే చట్ట బద్ధమైన మరియు న్యాయ పరమైన కోరికలు తీర్చవలెనని డిమాండ్ చేయటం జరిగింది.
యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ సురేష్ కుమార్ మాట్లాడుతూ FAPTO సి పి ఎస్ రద్దు కొఱకు నిరంతరము వివిధ స్థాయిల లో ఉద్యమాలు నిర్వహిస్తూ ఉందని FAPTO లో సభ్య సంఘాలు ఉపాధ్యాయ మరియ ఉద్యోగుల కొరకు నిరంతరం పోరాడుతున్నవి. గతంలో సి పి ఎస్ రద్దు కొరకు అనేక కార్యక్రమాలు నిర్వహించింది మరియు నిర్వహిస్తూ ఉంది. అంతే కాని మొక్కుబడిగా సంవత్సరంనకు ఒక్క సారి కార్యక్రమాలు నిర్వహించేది కాదు అని తెలిసే ఈ రోజు FAPTO పిలుపుకు స్పందించి జిల్లా వ్యాప్తంగా వేయి మందికి పైగా ఉపాద్యాయులు మరియు ఉద్యోగులు సెలవు పెట్టుకొని హాజరు అయ్యారు. వీరిలో సి పి ఎస్ పరిధిలో కి వచ్చే వారు మరియు రాని వారు కూడా హాజరయ్యారు అంటే FAPTO మీద వున్న నమ్మకం కారణమే అని చెప్పారు.
డి టి ఎఫ్ రాష్ట్ర నాయకులు శ్రీ రత్నం ఏసేపు ,బి టి ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఆనంద్ , ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గోకారి , APTF257 జిల్లా ప్రధాన కార్యదర్శి శివయ్య, APTF 1938 జిల్లా అధ్యక్షుడు బి.మాధవ స్వామి,కమలాకర రావు ,మహిళా నాయకురాలు శ్రీమతి నాగమణి, ప్రధానోపాధ్యాయుల సంఘము జిల్లా అధ్యక్షుడు శ్రీ ఓంకార్ యాదవ్ మరియు ప్రధాన కార్యదర్శి నారాయణ , అప్టా అధ్యక్షుడు శ్రీ మునగాల మధు సుధన్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ సేవా నాయక్, డి టి ఎఫ్ అధ్యక్షుడు కృష్ణ మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ గట్టు తిమ్మప్ప , బి టి ఏ అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శులు భాస్కర్ మరియు సుధాకర్ యూ టి ఎఫ్ జిల్లా నాయకులు శ్రీ ఎల్లప్ప ప్రసంగించారు.
FAPTO నిర్వహించిన ర్యాలీ మరియు బహిరంగ సభ యందు APNGO నాయకులు శ్రీ వి.జవహర్ లాల్, కృష్ణుడు, ఏపీ ప్రభుత్వ నర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి శాంతి భవానీ, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ అసోసియేషన్ నాయకులు శ్రీ మద్దిలేటి , RUPP నాయకులు శ్రీ రఘు ,పి ఈ టి అసోసియేషన్ నాయకులు శ్రీ వెంకటేశ్వరులు , CITU నాయకులు శ్రీ గౌస్ దేశాయ్ , AITUC నాయకులు మునెప్ప, ఎన్జీవో వెటర్నరీ ఉద్యోగుల సంఘ నాయకులు సుబ్బారాయుడు పాల్గొని తమ యొక్క మద్దతు మరియు సంఘీభావం ప్రకటించారు.
ర్యాలీ మరియు సభలో జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన మహిళా ఉద్యోగులు మరియు ఉపాద్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనటం విశేషం.
సభ అనంతరం నాయకులు అందరూ కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి సి పి ఎస్ రద్దు కోరుతూ మెమొరాండం సమర్పించారు.