ఉద్యోగులు సమయపాలన పాటించకపోతే ఎలా?
అనంతపురం: సచివాలయం ఉద్యోగులు సమయపాలన పాటించకుంటే ఎలా అని నగర మేయర్ మహమ్మద్ వసీం ప్రశ్నించారు.20వ డివిజన్ పరిధిలోని 32వ సచివాలయంను బుధవారం మేయర్ వసీం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బంది ఆలస్యంగా విధులకు హాజరు కావడంతో మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయం వ్యవస్థ ను ఏర్పాటు చేసి మిమ్మల్ని నియమించారని విధులకు ఆలస్యంగా హాజరు అయితే ఇక ఏ విధంగా ప్రజలకు సేవలు అందిస్తారని ప్రశ్నించారు.
ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం మేయర్ స్వంత డివిజన్ 38వ డివిజన్ లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అదే విధంగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డంపర్ బిన్ నిండిపోయి రోడ్డుపై చత్తా చెదారంతో దుర్గాంద భరితంగా మారిందని స్థానికులు పిర్యాదు చేయడంతో ఆ ప్రాంతాన్ని మేయర్ పరిశీలించారు.
నిత్యం ప్రయాణికులు తిరిగే ప్రాంతంలో ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు.ఆర్టీసీ సిబ్బంది పారిశుద్ధ్య నిర్వహణ కు సహకరించాలని ఆర్టీసీ అధికారులకు మేయర్ సూచించారు. మున్సిపల్ కార్పోరేషన్ తరపున డంపర్ బిన్ ఏర్పాటు చేస్తామని వాటి నిర్వహణను ఆర్టీసీ సిబ్బంది చూడాలని సూచించారు.ఆయా కార్యక్రమాలలో మేయర్ వెంట కార్పొరేటర్ లు లావణ్య,జయలలిత, కమల్ భూషణ్,నగర పాలక సంస్థ కార్యదర్శి సంగం శ్రీనివాసులు, నాయకులు చిన్నా, ఖాజా,కృష్ణం రఘు తదితరులు పాల్గొన్నారు.