ఎపీవోల ద్వారా రైతులకు బహుళ ప్రయోజనాలు

తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర రైతుల ఉత్పత్తి సంస్థ (ఎఫ్ఓ)ను కలెక్టర్ జె. నివాస్ సందర్శించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎప్పీలు దోహపడతా యని ఆయన అభిప్రాయపడ్డారు.

వ్వవసాయ ఉత్పత్తిదారులకు మెరుగైన ఆదాయాన్ని అందించడమే రైతుల ఆధ్వర్యంలోని రైతుల ఉత్పత్తిదారుల సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ దిశగా పనిచేస్తు డాక్టర్ వైయస్ఆర్ లైఫ్ టైం ఏచివ్ మెంట్ అవార్డు కూడా పొందిన శ్రీ విఘ్నేశ్వర రైతుల ఉత్పత్తి సంస్థను ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. విఘ్నేశ్వర రైతుల ఉత్పత్తి సంస్థ చైర్మన్ చంద్రమోహన్ రెడ్డి తమ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాల నుకలెక్టర్‌కు వివరించారు. తమ ప్రాంతం లో సుమారు 1500 ఎకరాల్లో అరటిపంట, 300 టన్నుల వరకు కూరగాయలు సాగు చేస్తున్నామన్నారు.

రైతులు పండించే అరటికాయల వేలం ఇక్కడ నిర్వహిస్తామని, ఇందుకు బయట వ్యక్తులు 10 శాతం కమిషన్ తీసుకుంటారని అదేతమసంస్థ కేవలం 6 శాతం మాత్రమే తీసుకుంటుందని దాని వల్ల రైతుకు 4 శాతం లబ్ధి చేకూరుతుందన్నారు. తమ ఎఫ్ నీ వో ద్వారా పురుగుల మందులు విక్రయయిస్తున్నామన్నారు. దీనివల్ల బయటకన్న 20 నుంచి 30 శాతం రైతుల కు ఆదా అవుతుందన్నారు. ఎఫ్ పీ వో లోని రైతు సభ్యులు పండించిన కూరగాయలను విక్రయించేందుకు చాగంటి పాడు కట్టపై అవుట్ లెట్ ఏర్పాటు చేసి రోజు 5 నుంచి 6 వేల టన్నుల కూరగాయలు అమ్మకాలు సాగిస్తున్నామన్నారు.

ఉద్యానశాఖ సహకారంతో కస్టమ్రైజేషన్ సెంటల్ ఏర్పాటు చేశామని, పసుపు పొలిషింగ్ డ్రమ్స్, ట్రాక్టర్ తదితర వాటిని రైతుల అవసరాలకు అందిస్తు రూ. 200 నుంచి 300 వరకు ఖర్చు తగ్గిస్తున్నా మన్నారు. దుక్కు దున్నేందుకు బయట రూ. 900 వసూలు చేస్తుండగా ఎఫ్ పీవో ద్వారా సభ్యులకు అయితే రూ. 500 బయ టవారికి రూ. 600 తీసుకుంటున్నామని ఆయన కలెక్టర్‌కు వివరించారు. షేర్ నెట్ కూడా ఏర్పాటు చేసి నారు కోసం విత్తనా లు ఇచ్చిన వారి నారు, స్వయంగా నారు కూడా ఉత్పత్తి కలిగిన ఏర్పాట్లు చేశా మన్నారు. ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి. దయాకరబాబు పాల్గొన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker