జాతీయ స్థాయి సబ్ జూనియర్ షూటింగ్ బాల్ పోటీలకు రాష్ట్ర జట్టు
విజయవాడ, స్పోర్ట్స్ న్యూస్:
ఈ నెల 27 నుంచి 29 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ని ఘజియాబాద్ పట్టణం లో జరిగే 40 వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొనే ఆంద్రప్రదేశ్ సబ్ జూనియర్ బాల బాలికల జట్లు బుధవారం విజయవాడ నుంచి బయలుదేరాయి. జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో రాణించాలని , క్రమశిక్షణ తో కూడిన క్రీడా సాధన కి గెలుపు ఖాయమని ఆంద్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.పరుశ రాముడు క్రీడాకారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్ కుమార్ తో పాటు ధనియాలు అప్పారావు , అబ్దుల్ కరీం గణేష్ , శ్రావణి , క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బాలికల జట్టు:
స్రవంతి , లహరి , సింధూర సాహితీ, తనుశ్రీ, తనుజ, ఏసుమణి , లిఖిత, పల్లవి, ట్యాంజియా నూర్ , తోరని, నీరజ, భవ్య , కోచ్ గా శ్రావణి , మేనేజర్ గా సుమ లత వ్యవహరిస్తున్నట్టు తెలిపారు.
బాలుర జట్టు:
త్రిపుర శ్రీ సతీష్ , చరణ్ తేజ రెడ్డి,
స్వరూప్ కుమార్, షామ్స్ తబరేజ్,
వీర మని కంఠ, అమీర్, శరన్ హేమంత్, శివ అంజనేయులు , హిమ సాయి నాగ హస్వంత్ కుమార్, రోహిత్ నాగ వర్మ, చిన్న అహఒరోను, భానుమూర్తి,
కోచ్ గా విజయ్ కుమార్ మరియు
మేనేజర్ గా గణేష్ వ్యవహరిస్తున్నట్టు తెలిపారు.