Sathya Sai Trust: పిల్లలకు ప్రకృతి నా గురువు వ్యాసరచన పోటీలు
కొండపల్లి ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ప్రకృతి నా గురువు అన్న అంశంపై శ్రీ సత్యసాయి వ్యాసరచన పోటీలు
అనంతపురం జిల్లా పెనుకొండ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో కొండపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రకృతి పరిరక్షణ, పరిసరాల పరిరక్షణలో భాగంగా ప్రకృతి నా గురువు అనే అంశంపై గ్రూప్ -1 వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది.
ఈ పోటీలు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల కొండంపల్లి గ్రామం నందు నిర్వహించగా 11 మంది విద్యార్థినులు, 7 మంది విద్యార్థులు మొత్తం 18 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు.
వ్యాసరచన పోటీలు నిర్వహించేందుకు గాను విద్యాజ్యోతి కర్నూలు మరియు అనంతపురం జిల్లా కోఆర్డినేటర్ మరియు జిల్లా మీడియా ఇంచార్జ్ బీ.శ్రీరాములు, పెనుకొండ శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ బి. శంకర మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.వెంకటలక్ష్మి, సహాఉపాధ్యాయురాలు షాహీ తాజ్ మరియు కొండపల్లి సత్య సాయి భజన మండలి వారు సంస్థ తెలిపిన నిబంధనలకు అనుగుణంగా పోటీ పరీక్షలను నిర్వహించడం జరిగింది.
కార్యక్రమం ద్వారా పిల్లలలో నైపుణ్యత పెరిగి భవిష్యత్తులో పిల్లల ఎదుగుదలకు ఈ వ్యాసరచన పోటీలు ఎంతగానో ఉపయోగపడగలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు. పోటీలు నిర్వహించినందుకు శ్రీసత్యసాయి సేవా సంస్థలకు మరియు బాలవికాస్ – విద్యా జ్యోతి కార్యక్రమానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.