ఏపీకి రానున్న జాతీయ ఎస్సి కమిషన్ బృందం


అమరావతి:ఆంధ్రప్రదేశ్ దళిత యువతి రమ్య హత్య కేసు కు సంబంధించిన వివరాలు సేకరించేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం ఏపీ సీఎస్, డిజిపి ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న దళిత యువతి రమ్య హత్యపై విచారణ కోసం జాతీయ ఎస్సీ కమిషన్ మంగళవారం ఏపీకి చేరుకుంది. అమరావతి సచివాలయంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ లతో జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షులు అరుణ్ హల్దార్ సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే,l కమిషనర్ హర్షవర్ధన్, పోలీస్ శాఖ డీఐజీలు రాజకుమారి, రాజశేఖర్, గుంటూరు జిల్లా రూరల్ అండ్ అర్బన్ ఎస్పీ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Ramya


రమ్య హత్య జరిగిన ప్రాంతాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ బృందం పరిశీలించింది. అలాగే రా మీ కుటుంబ సభ్యులతో కొద్దిసేపు చర్చించారు.
అనంతరం అతిథి గృహంలో వివిధ రాజకీయ పార్టీలా, ప్రజా సంఘాల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సంఘటనపై కమిషన్ ఉపాధ్యక్షులు అరుణ్ హల్దార్ మాట్లాడుతూ… రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు. రమ్య హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ, తప్పకుండా రమ్య కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తామని కమిషన్ ఉపాధ్యక్షులు అరుణ్ భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందానికి గన్నవరం విమానాశ్రయంలో బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.