YCP రంగులను తొలగించండి: హైకోర్టు ఆగ్రహం



Amaravati: ycp ప్రభుత్వానికి కోర్టులో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేయడం పై హైకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది.

అక్టోబర్ ఆరో తేదీ లోపు రంగుల అన్నిటిని తొలగించాలని ఆదేశించింది. తొలగించిన అనంతరం కోర్టుకు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తెలియజేసింది. రంగులు తొలగించారో, లేదో నివేదిక ఇవ్వాలని, పిటిషనర్ తరఫు న్యాయవాది జాడ శ్రావణ్ కూడా ఆదేశించింది. ఈ వ్యవహారంపై గురువారం పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది. స్వచ్ఛంద కార్పొరేషన్ MD కోర్టుకు హాజరయ్యారు.

కోర్టు ఆదేశాలు ఉన్న, చెత్త నుంచి సంపద తయారుచేసే కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు ఎలా వేస్తారు అని అధికారులపై కోర్టు సీరియస్ అయ్యింది. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడానికి తక్షణమే లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. గుంటూరు జిల్లా మాచర్ల, ప్రత్తిపాడులో ప్రభుత్వ కార్యాలయాలు మోటార్లకు వైసిపి రంగులు వేయడం పై, జై భీమ్ యాక్సిస్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పరసా సురేష్. హైకోర్టును ఆశ్రయించారు. పది రోజుల క్రితం హైకోర్టులో దీనిపై న్యాయవాది జాడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. దీంతో సంబంధిత అధికారులు కోర్టు హాజరు కావాలని అని గతంలో కోర్టు ఆదేశించింది.

చిలకలూరిపేట లో ఎన్నికలుకు హైకోర్టు పచ్చజెండా ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ లపై హైకోర్టులో విచారణ వైసీపీలో ఆధిపత్య పోరు వైసిపి రంగులమయం ఉద్యోగం నుంచి ఇద్దరు వాలంటీర్స్ తొలగింపు నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలు బేఖాతరు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker