పాలీసెట్ కౌన్సిలింగ్ 29 నుంచి
ఈనెల 29 నుంచి పాలీసెట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. జిల్లాలో రెండు హెల్ప్ లైన్ సెంటర్లో అందుబాటులో ఉంటాయి. ఈనెల 29 నుంచి ఆగస్టు 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ర్యాంకుల వారిగా చేస్తారు.
వచ్చేనెల 6 నుంచి 11 వరకు కళాశాల ఎంపిక ర్యాంకుల కుల వారీగా పెట్టుకోవాలి. 12న కళాశాల ఎంపికలో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. 16 నా సీట్లో అలాట్మెంట్ ఇస్తారు.17 నుంచి కాలేజీలో రిపోర్ట్ చేయాలి. 22 నుంచి పాలిసెట క్లాసులు ప్రారంభం అవుతాయి. హెల్ప్ లైన్ సెంటర్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటాయి.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎలా?
ఈనెల 29న 1వ ర్యాంక్ నుంచి 10,000 ర్యాంకు వరకు, 30న 10,001 నుంచి 25,000 వరకు, 31న 25,001 నుంచి 40,000 వరకు, ఆగస్టు 1న 40,001 నుంచి 55,000 వరకు, 2 న 55,001 నుంచి 71,000 వరకు, 3 న 71,001 వేల నుంచి 87,000 వేల వరకు. 4న 87,001 నుంచి 1,04,000 వేల వరకు, 5 న 1,040,001 ఒకటి ర్యాంకు నుంచి చివరి ర్యాంక్ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు.
ఆగస్టు 6, 7 తేదీల్లో ఒకటి నుంచి 40,000 ర్యాంక్ వరకు కళాశాల ఎంపిక చేసుకోవాలి. 8,9 తేదీల్లో 40,001 నుంచి 80 వేల వరకు. 10,11 తేదీల్లో 80 వేల ఒకటి ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ కొరకు విద్యార్థులు కళాశాలలు ఎంపిక చేసుకోవాలి.
కౌన్సిలింగ్ కు తేవాల్సిన సర్టిఫికెట్స్
పదోతరగతి మార్క్ లిస్ట్
4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్
పాలీసెట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్
కుల ధ్రువీకరణ పత్రం
తెల్లరేషన్ కార్డు లేదా ఇనకమ్ సర్టిఫికెట్ (2.50 లక్షల వరకు)
ఓసీలకు ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్ (ఈ సం.ది)
ఒరిజినల్స్ తో పాటు ఒక జిరాక్స్ సెటు తీసుకురావాలి
కౌన్సిలింగ్ ఫీజు కింద ఓ.సీ, బీసీలకు రూ.900, ఎస్సీ. ఎస్టీలకు రూ.500 ఆన్లైన్లో చెల్లించాలి. హెల్ప్ లైన్ సెంటర్లో ఏటీఎం ద్వారా చెల్లించవచ్చు.