సచివాలయ ఉద్యోగులకు ప్రొబెషనరీ పరీక్షల షెడ్యూల్
సచివాలయ ఉద్యోగులకు ప్రొబెషనరీ పరీక్షలు
• ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ • నేటి నుంచి దరఖాస్తులు.. 28 నుంచి 30 వరకు పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ పరీక్షలకు నేటి నుంచి నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు సంవత్సరాల ప్రొఫెషన్ పూర్తి కానుంది. దీంతో ఏపీపీఎస్సీ ద్వారా ప్రొబేషనరీ అర్హత పరీక్షలు నిర్వహించేందుకు నేటి నుంచి 17వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో ఓటీపీఆర్ ద్వారా దరఖాస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులు యూనిక్ యూజర్ ఐడి తో ఆన్లైన్ దరఖాస్తులు అప్లై చేసుకోవాలి. మొత్తం మూడు మార్కులకు పరీక్ష నిర్వహిస్తే అందులో 40 మార్కులు సాధించిన వారికి ప్రొబెషనరీ కి అర్హులుగా గుర్తిస్తారు. ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీతో వార్డు గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడి రెండేళ్ళు పూర్తి కానుంది. ఈనెల పరీక్ష నిర్వహించి వారిని ఎంపిక చేసి ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
READ MORE: సచివాలయ ఉద్యోగులకు ముఖ్య అలర్ట్
ప్రొబెషన్ పరీక్షలనుంచి మిన హాయింపు ఇవ్వాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రొబెషనరీ పరీక్షలు తప్పవని కొన్ని మినహాయింపులతో వెసులుబాటు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే అర్హత మార్కులను 40గా నిర్ణయించింది