Bajaj CT 125X: ఫీచర్స్, స్పెసిఫికేషన్ అండ్ ధర
Bajaj CT 125X: దేశీయ పాపులర్ ద్విచక్ర వాహన తయారీదారి బజాజ్ తమ బ్రాండ్ నుంచి అత్యంత సారవంతమైన 125 సిసి బైక్ Bajaj CT 125X భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్ షోరూమ్ ఉదయ్ బైక్ ధర సుమారు ₹71,354. ఈ బైక్ చూడటానికి CT 110X మోడల్ లాగానే ఉంది.
అంతేకాకుండా సరికొత్త Bajaj CT 125X లో ప్రకాశవంతమైన గుండ్రటి హెడ్ లైట్, హెడ్లైట్ కు ఏమి కాకుండా గార్డు కూడా ఉంది. ఇక దీని అనుసంధానం పైన ఎల్ఈడి స్ట్రిప్ తో కూడిన చిన్న కౌల్ కూడా ఉంది. అదేవిధంగా ఇంజన్ క్రాస్ గార్డ్, అలాగే వెనుక వైపున లగేజ్ ర్యాక్ కూడా ఉంది.
రోజువారి అవసరాల కోసం మైలేజ్ ఎక్కువ కోరుకునే వారికి ఈ బైక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది గ్రీన్ బ్లాక్, బ్లూ బ్లాక్, రెడ్ బ్లాక్ వంటి మూడు ఆకర్షణీయమైన డోన్ పెయింట్ స్కీములలో లభిస్తుంది. Bajaj CT 125X లో 124.4 సిసి సామర్థ్యం కలిగిన సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంది.
ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. ఈ ఇంజన్ ఒక గరిష్ట శక్తి 10 bhp, దీని యొక్క గరిష్ట టార్క్ 11nm ను ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటి ఇంజన్ బజాజ్ డిస్కవర్ లో కూడా ఉంది. ఈ బైక్ కు ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్ లు, వెనకాల డ్యూయల్ గ్యాస్ ఛార్జ్డ్ రియల్ స్ప్రింగ్ షాక్ అబ్జర్బ్ర్ల లను కలిగి ఉంటుంది.
బ్రేకింగ్ హార్డ్వేర్ లో ముందు చక్రానికి 240mm డిస్క్ బ్రేక్, వెనక చక్రానికి 130 mm డిస్క్ బ్రేక్ ఉంది. అంతేకాకుండా డబల్ డ్రమ్ బ్రేకులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్ యొక్క మైలేజ్ 65kmpl ఇస్తుంది.
ఈ సరికొత్త Bajaj CT 125X బైక్ భారత మార్కెట్లో TVS రేడియన్, హీరో గ్లామర్, హోండా షైన్, హోండా SP 125 వంటి బైకులకు పోటీగా ఉంటుంది. ఇందులో డిజిటల్ స్పీడోమీటర్ వంటివి లేవు. ఈ బైక్ యొక్క ఇంధన సామర్థ్యం 10.5 లీటర్లు ఉంటుంది. ఈ బైక్ పై డ్రైవ్ చేస్తున్నప్పుడు థాయ్ గ్రిప్ కోసం ప్లాస్టిక్ మెటల్ ను ఇచ్చారు.