Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతున్న కార్లు ఇవే

ఇండియా మార్కెట్లోకి కొత్త వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఉంచుకొని వాహన తయారీ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను మరియు అప్డేట్ వాహనాలను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ నెలలో ఇప్పటికే మారుతి సుజుకి 2022 ఆల్టో కే టెన్ మహేంద్ర కంపెనీ కొత్త స్కార్పియో క్లాసిక్ వంటి వాటిని లాంచ్ చేసింది. ఇక ఈనెల మోగేయడానికి కొన్ని రోజులు ఉన్నాయి. అయితే కొన్ని కంపెనీలు రానున్న సెప్టెంబర్ నెలలో విడుదల చేయడానికి కొన్ని వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో టయోటా కంపెనీ అర్బన్ క్రూయిజర్ హై రైడర్, హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా మరియు ఆడి కంపెనీ తన Q3 SUV తీసుకురాబోతున్నాయి. 

Toyota Urban Cruiser Hyryder: దేశీ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న టయోటా 2022 సెప్టెంబర్ నెలలో కొత్త అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అనే కారును విడుదల చేయనుంది. టయోటా కంపెనీ ఈ కొత్త ఎస్ యు విని ఇప్పటికి మార్కెట్లో ఆవిష్కరించింది కానీ, ఇంకా దీని ధర వెల్లడిపరచలేదు. అంతేకాకుండా డెలివరీలు కూడా వచ్చే నెలలో ప్రారంభమైయే అవకాశం ఉంటుంది. యాదవ్ కంపెనీ ఎస్ యువి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది.

కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్లో లేదా డీలర్ షిప్ లలో ₹25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చును. టొయోటో యొక్క అర్బన్ క్రూయిజర్ హై రైడర్ మొత్తం నాలుగు టీమ్స్, రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అయితే ఇందులోని స్, G మరియు V టీమ్స్ లో స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్, E టీమ్స్ లో మైల్డ్ హైబ్రిడ్ స్టీమ్ కూడా అందుబాటులో ఉంటుంది.

స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ లు 1.5 లీడర్ TNGA అట్కిన్సన్ పెట్రోల్ ఇంజన్, 177.6 V లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఈ కారు యొక్క ఇంజన్ పవర్ 92 bhp, దీని యొక్క గరిష్ట టార్క్ 122 ఉత్పత్తి చేస్తుంది.. కావున మంచి ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తుంది. ఇక మైండ్ హైబ్రిడ్ ఇంజన్ విషయానికి వస్తే ఇందులో డ్రైవ్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంటుంది.  ఇది 1.5 లీటర్ K15C మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్ పొందుతుంది. దీని ఇంజన్ యొక్క గరిష్ట శక్తి 103 bhp, దీని యొక్క గరిష్ట టర్కు 137 nm. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ లేదా సిక్స్ స్పీడ్ ఆప్షనల్ గేర్ కన్వర్జేషన్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంది. 

Toyota Urban Cruiser Hyryder
Toyota Urban Cruiser Hyryder

Maruthi Suzuki Grand Vitara: మారుతి సుజుకి పోతున్న కొత్త గ్రాండ్ విటారా ను కూడా వచ్చే నెలలో అధికారకంగా విడుదల చేయనున్నారు. దాని ధర కూడా అప్పుడే వెల్లడి పరుస్తారు. అయితే ఇప్పటికే కంపెనీ ఈ ఎస్ యు వి కోసం బుకింగ్లను కూడా స్వీకరించడం మొదలుపెట్టింది. కావున దీనిని బుక్ చేసుకోవాలనుకునే వారు ఆధికృత డీలర్ షిప్ లో వద్ద లేదా ఆన్లైన్లో 11000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ఇప్పటికే కంపెనీ ఈ కొత్త SUV కోసం 20,000 కంటే తక్కువ బుకింగ్లను స్వీకరించింది. మారుతి సుజుకి గ్రాండ్విటార ఎస్ యు వి పెట్రోల్ వేరియంట్ లో గరిష్టంగా 27.9 కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది. ఇది ప్రస్తుతం భారతదేశంలోని ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారుగా నిలిచింది. దీని ఇంజిన్ లో 1.5 లీటర్, 3 సిలిండర్, న్యాచురల్లి ఆప్సిరేటెడ్, ఆట్కిన్సన్ సైకిల్ ఇంజన్ మరియు ఎలక్ట్రానిక్ మోటార్ లు ఉన్నాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 144.5 bhp శక్తిని, 122 nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 

Mahindra XUV 400: మహేంద్ర కంపెనీ ఆగస్టు 15న 5 ఎలక్ట్రిక్ కార్లను ఇండియా మార్కెట్లో ఆవిష్కరించింది. అయితే కంపెనీ వీటిని 2024, 2026 న విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. అయితే అంతకంటే ముందు ఎక్స్ యు వి 400 ఎలక్ట్రిక్ కారును విడుదల చేయటానికి ప్రణాళిక సిద్ధం చేసింది. కంపెనీ పటిక అందించిన సమాచారం ప్రకారం తన ఎక్స్యువి 400 ఎలక్ట్రిక్ ఎస్ యు వి 2022 సెప్టెంబర్ నెలలో ప్రారంభించబడే అవకాశం ఉంటుంది. ఇది ఇండియా మార్కెట్లో కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్ యు వి అవుతుంది.

అయితే ఇకపై ప్రొడక్షన్ కి సిద్ధమవుతుంది. కావున ఇది భారతీయ రోడ్లమీద తిరగడానికి ఇంకా కొన్ని ఎన్నో రోజుల సమయం లేదని స్పష్టం అవుతుంది. మహేంద్ర ఎక్స్ యు వి 400 అనేది కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కేలబుల్ మరియు మాన్యువల్ ఆర్కిటెక్చర్ ప్లాట్ఫారంపై తయారు చేయబడుతుంది. కావున ఇది అత్యంత పవర్ఫుల్ ఎలక్ట్రిక్ యు ఎస్ వి అవుతుంది. ఇది దేశ మార్కెట్లోని ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు విభాగంలో దూసుకెళ్తున్న టాటా నెక్సన్ వంటి వాటికి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 

Hyundai Venue N Line: సెప్టెంబర్ నెలలో హ్యుందాయ్ కంపెనీ కూడా కొత్త వెన్యూ N లైన్ విడుదల చేస్తోంది. ఇది వచ్చే నెల సెప్టెంబర్ 6న విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త మోడల్ డిజైన్, ఆల్ బ్లాక్ ఇంటీరియర్ తోపాటు ట్విక్డ్ సస్పెన్షన్ సెటప్, ఎగ్జాస్ట్ సిస్టంతో వస్తుంది. హ్యుందాయ్ వెన్యూ N లైన్ ఇంజన్ 1.0 లీటర్, 3 సిలిండర్ టర్బో చార్జర్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది. దీని యొక్క గరిష్ట శక్తి 118 బిహెచ్పి దీని యొక్క గరిష్ట టర్కు 178nm ను ఉత్పత్తి చేస్తుంది. 

2022 Audi Q3: జర్మనీ కారు తయారీ కంపెనీ ఆడి దేశీయ మార్కెట్లో తన కొత్త క్యూ3 విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. అంతేకాకుండా కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ ను కూడా ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు అధికృత డీలర్ షిప్ ని సందర్శించి లేదా అధికారిక వెబ్సైట్లో ముందస్తుగా రెండు లక్షలు చెల్లించి బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. డెలివరీలో ఈ సంవత్సరం చివరినాటికి ప్రారంభిస్తాయి కొత్త ఆడి క్యూ 3 ఎస్ యు వి 2022 సెప్టెంబర్ నెలలో దేశీయ విఫణిలో విడుదల చేయనుంది. 2023 ఆడి క్యూ 3 2 వేరియన్లలో వస్తుంది ప్రీమియం ప్లస్, టెక్నాలజీ ట్రిమ్ లు. ఇది ఫోక్స్ వేగన్ యొక్క MQB ప్లాట్ ఫారం పై తయారు చేయబడుతుంది.

అదే సమయంలో ఇది క్యూ8 ఎస్వీ నుండి ఇన్స్పైర్ కావడం జరిగింది. కొత్త ఆడి క్యూ 3 విదేశీయ మార్కెట్లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో, 2.0 టర్బో పెట్రోల్ ఇంజన్ అప్సన్స్ పొందుతుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్పి శక్తిని అందించగా. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ట్యూన్స్ లో 190 బిహెచ్పి శక్తిని అండ్ 230 బిహెచ్పి శక్తి ఉత్పత్తి చేస్తాయి. 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker