చికెన్ కర్రీ లో నీళ్లు కూడా వేసుకోకుండా గ్రేవీ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో తెలుసా?
ప్రపంచంలో ఉండే జనాభాలో శాఖాహారులు ఎంతమంది ఉన్నారో, అంతకు రెట్టింపు నాన్ వెజిటేరియన్సు ఉన్నారు. వారికి ఎన్నో రకాల వంటలు ఇష్టం ఉన్నప్పటికీ చికెన్, మటన్ తో చేసే వంటలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎక్కువ శాతం చికెన్ తినడానికి ఇష్టపడతారు.
ఏ శుభకార్యాలకైనా, పుట్టినరోజు ఫంక్షన్లకు అయినా ఇలా ఇలాంటి కార్యక్రమాలు జరిగినా వాటిలో ఉండే భోజనాల జాబితాలో కచ్చితంగా చికెన్ తో చేసే వంటకాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. అదేవిధంగా ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు, ఇంటికి బంధువులు వచ్చిన ముందుగా గుర్తుకు వచ్చే వంట చికెన్. ఇదేవిధంగా ఏ హోటల్ కు వెళ్లిన చికెన్ తో చేసే వంటకాల ప్రత్యేక మెనూ ఉంటుంది.
అంత ఎక్కువగా ఇష్టపడుతుంటారు. చికెన్ తో మనం చాలా రకాల వంటలు చేస్తుంటారు. అందులో ఎక్కువ గుర్తు వచ్చేది చికెన్ కర్రీ, చికెన్ పకోడీ ,చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, చికెన్ గోంగూర ఇవే కాక చాలానే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చికెన్ పచ్చడి కూడా తయారు చేస్తున్నారు.వీటిలో చాలా వంటలు ఇంటిలోనే చేసుకుని తినడానికి కొంతమంది ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇంటిలోనే చికెన్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్ లాగా వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం
చికెన్ ఫ్రై చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
చికెన్ ఫ్రై చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
చికెన్ ఆఫ్ కిలో
పచ్చిమిర్చి నాలుగు
నిమ్మకాయ
ఉప్పు
కారం
కొత్తిమీర
టేబుల్ స్పూన్ మిరియాలు
ఆఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు
కొంచెం చేక్క
నాలుగు లవంగాలు
అల్లం వెల్లుల్లి పేస్ట్
వంటకు సరిపడినంత నూనె
పసుపు
ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు.
చికెన్ ఫ్రై తయారు చేసుకునే విధానం:
ముందుగా చికెన్ మీడియం సైజులో కట్ చేసుకుని అందులో కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి రెండు లేదా మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం నిమ్మకాయ రసం, ఉప్పు వేసి బాగా కలిపి, ఒక గంట లేదా రెండు గంటల వరకు అలాగే ఉంచాలి.
తర్వాత పావు భాగం ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగాలు అన్నిటిని చిన్న మంటపై దోరగా వేయించి మెత్తగా మిక్సీ పట్టి మసాలాను తయారు చేసుకోవాలి.
చికెన్ కు నిమ్మరసం, ఉప్పు బాగా పట్టిన తర్వాత స్టవ్ పై బాండీ పెట్టి అందులో తగినంత నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి.
ఆ తర్వాత చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకొని కొద్దిగా సేపు ఉడికించుకోవాలి. ఇలా చికెన్ ను మధ్య మధ్యలో కలుపుతూ 70% ఉడికిన తర్వాత అందులో తగినంత కారం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసి చికెన్ బాగా కలిపి, చిన్న మంటపై ఉడికించుకోవాలి.
చికెన్ ఉప్పు వేసి పెట్టినప్పుడు వచ్చిన నీటిని కూడా ఇందులో వేసుకొని ఉడికించుకోవచ్చు. అలా బాగా ఉడికించుకుంటూ, మధ్య మధ్యలో కలుపుతూ, ఉంటే చికెన్ అడుగంటకుండా ఉండి బాగా ఉంటుంది. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి, చిన్నమంటపై అలాగే ఉంచి, తర్వాత దించుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ ఫ్రై తయారవుతుంది. ఈ విధంగా ఇంట్లోనే చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. హోటల్లో చేసే చికెన్ ఫ్రై లాగా చాలా బాగా ఉంటుంది.