CAT: కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో మేనేజ్మెంట్ కోర్సులు చేరేందుకు అవకాశం కల్పించే ప్రవేశ పరీక్ష టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎం కాలేజీలే స్వయంగా ఈ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే క్యాట్ లో సాధించిన పర్సంటేజ్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్ స్కోర్ తో కాకుండా పేరు ఉన్న కళాశాలలో అడ్మిషన్లు ఉంటాయి.
అహ్మదాబాద్, అమృత్సర్, జమ్మూ, ఇండోర్, బెంగళూర్, రాయపూర్, బోధ్ గయా, నాగపూర్, కోల్కత్తా, ఉదయపూర్, షిలాంగ్, కాశీపూర్, ఇండోర్, సిర్మౌర్, రాంచి, లక్నో, విశాఖపట్నం, సంబల్పూర్, కోజికోడ్, తిరుచిరాపల్లి దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎం కాలేజీలు.
50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులున్నా అర్హులే. డిగ్రీ చివరి సంవత్సరం పూర్తి చేస్తున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఎగ్జాం నిర్వహిస్తారు. పరీక్షల్లో 3 విభాగాలు ఉన్నాయి. వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రెహెన్షన్, డేటా ఇంటర్ ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్,క్వాంటిటేటీవ్ ఎబిలిటీలో విభాగాలలో పరీక్షలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు కలవు. ఈ పరీక్షలో ఉత్తీర్లైన వారికి గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించాక ఎంపిక చేస్తామని తెలిపారు.
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ సిటీలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా మొత్తం 150 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 14 వరకు అప్లై వేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు 2,300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులు 1,150 అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష నవంబర్ 27న ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.iimcat.ac.in వెబ్సైట్ ను చూడగలరు.